Balayya : దిల్ రాజు బ్యానర్‌లో బాలయ్య.. మలయాళ దర్శకుడితో క్రేజీ కాంబినేషన్
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'వీరసింహారెడ్డి' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు అదే కాంబోలో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ కొత్త సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతుండగా, త్వరలోనే మూవీ సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఇదిలా ఉండగా, గోపీచంద్ మలినేని సినిమా అనంతరం బాలయ్య మరో షాకింగ్ ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టినట్లు ఫిల్మ్‌నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మలయాళంలో 'మార్కో' సినిమాతో సంచలనం సృష్టించిన యువ దర్శకుడు హనీఫ్ అదేనీ చెప్పిన కథకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
Details
'శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్' బ్యానర్‌పై మూవీ
యాక్షన్ సినిమాలను తనదైన మేకింగ్ స్టైల్‌తో కొత్త స్థాయికి తీసుకెళ్లే దర్శకుడిగా హనీఫ్ అదేనీకి పేరుంది. ఇప్పుడు బాలయ్య మార్క్ మాస్ ఎనర్జీకి, హనీఫ్ అదేనీ స్టైలిష్ యాక్షన్ జతకలిస్తే బాక్సాఫీస్ ఖచ్చితంగా షేక్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ 'శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్' బ్యానర్‌పై అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. బాలకృష్ణ-దిల్ రాజు కాంబినేషన్‌లో సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు.
Details
త్వరలోనే అధికారిక ప్రకటన
హనీఫ్ అదేనీ కథలోని ఇంటెన్సిటీ బాలయ్యకు బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖరారైనట్టేనని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై అధికారికంగా అదిరిపోయే ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది. ఈ కాంబినేషన్ ఫిక్స్ అయితే మాత్రం బాలయ్య అభిమానులకు ఫుల్ ఖుషీ ఖాయం. అంతేకాదు ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళంలో కూడా తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.