భార్యాభర్తలను విడదీయడమే గురూజీ స్పెషల్ అంటూ బండ్ల గణేష్ ట్వీట్
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన తీసే సినిమాల కంటే పవన్ కళ్యాణ్ గురించి ఆయన మాట్లాడే మాటల ద్వారానే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు బండ్లగణేష్. పవన్ కళ్యాణ్ పై పొగడ్తల వర్షం కురిపించడంలో బండ్ల గణేష్ ని మించిన వారు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో. అదలా ఉంచితే, ప్రస్తుతం బండ్ల గణేష్ ట్వీట్లు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. తనకు ప్రొడ్యూసర్ కావాలనుందని, ఎలా అంటూ బండ్ల గణేష్ ను ఒక నెటిజన్ అడిగాడు. దానికి సమాధానంగా గురూజీకి ఖరీదైన బహుమతి కొనిస్తే ప్రొడ్యూసర్ అయిపోతావని బండ్ల గణేష్ రిప్లై ఇచ్చాడు.
ఎవ్వరినైనా విడదీయడమే గురూజీ స్పెషాలిటీఅంటూ ట్వీట్
అంతేకాదు, గురూజీకి కథ చెప్తే స్క్రీన్ ప్లే మార్చేసి, దానికి తగ్గట్టు మళ్లీ కథను మార్చి అనుకున్న కథను షెడ్ కు పంపిస్తాడని టాక్ ఉంది అని మరొక నెటిజన్ అడగడంతో, అదొక్కటే కాదు, భార్యాభర్తల్ని, తండ్రి కొడుకులను, గురు శిష్యులను ఎవ్వరినైనా వేరు చేస్తాడు.. అదే గురూజీ స్పెషాలిటీ అని బండ్ల గణేష్ సమాధానం ఇచ్చాడు. టాలీవుడ్ లో ఒకానొక దర్శకుడిని అభిమానులు అందరూ గురూజీ అని ప్రేమగా పిలుచుకుంటారు. ఇప్పుడు బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు ఆ గురూజీని ఉద్దేశించినవేనా కాదా అనేది తెలియాల్సి ఉంది. ఇక్కడ విశేషమేంటంటే, తనకు ప్రొడ్యూసర్ కావాలనుందని అడిగిన నెటిజన్, తన ట్వీటును డిలీట్ చేసేసాడు.