LOADING...
Bandla Ganesh : 'పాయా పాయా' సాంగ్‌లో పవన్ కళ్యాణ్‌పై ప్రేమను చూపించిన బండ్లన్న.. ఫ్యాన్స్ ఫిదా!
'పాయా పాయా' సాంగ్‌లో పవన్ కళ్యాణ్‌పై ప్రేమను చూపించిన బండ్లన్న.. ఫ్యాన్స్ ఫిదా!

Bandla Ganesh : 'పాయా పాయా' సాంగ్‌లో పవన్ కళ్యాణ్‌పై ప్రేమను చూపించిన బండ్లన్న.. ఫ్యాన్స్ ఫిదా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 01, 2026
02:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ స్థాయి సెటైర్లు వేసినా, స్టేజ్ ఎక్కి పవన్ కళ్యాణ్ నామస్మరణతో అభిమానులను ఊగిపోయ్యించే సామర్థ్యం కేవలం బండ్ల గణేష్‌కినే సాధ్యం. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న బండ్లన్న, ఇప్పుడు తన కొత్త మూవీ 'సంప్రదాయని సప్పిని సుద్దపూసని' (SSS)తో తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'పాయా పాయా' సాంగ్ విడుదల అయ్యింది. ఈ పాటలో కూడా బండ్ల గణేష్ తన ప్రత్యేక మార్క్ 'పవన్ భక్తి'ని వదలలేదు. 'ఈశ్వర.. పవనేశ్వర.. పవరే శ్వర' అంటూ పవన్ కళ్యాణ్‌పై తన ప్రేమను పాటలో వ్యక్తం చేశారు. ఈ సాంగ్‌ను చూసిన నటుడు శివాజీ ఫిదా అయ్యారు.

Details

ఫిబ్రవరి 12న రిలీజ్

సోషల్ మీడియాలో 'బండ్ల గణేష్‌కి పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమ చాలా స్వచ్ఛమైనది, దానికి ఇంకెవరూ సాటిరారని క్రేజీ పోస్ట్ పెట్టి ఆయన ఎనర్జీని మెచ్చుకున్నారు. సాంగ్‌లో బండ్ల గణేష్ వేసిన స్టెప్పులు, ఎక్స్‌ప్రెషన్స్ చూసిన ఫ్యాన్స్, పాత బండ్లన్నను మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఆనందంలో మునిగిపోతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 12న 'ఈటీవీ విన్' OTTలో నేరుగా రిలీజ్ కానుండటంతో, వెండితెరపై నిర్మాతగా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బండ్లన్న, ఇప్పుడు ఓటీటీలో నటుడిగా ఎలాంటి మ్యాజిక్ చూపిస్తారోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో వైరల్

Advertisement