LOADING...
Bandla Ganesh: బీజీ బ్లాక్ బస్టర్స్ అనౌన్స్.. మళ్లీ ప్రొడ్యూసర్‌గా బండ్ల గణేష్.. ఫస్ట్ మూవీ ఎవరితో?
బీజీ బ్లాక్ బస్టర్స్ అనౌన్స్.. మళ్లీ ప్రొడ్యూసర్‌గా బండ్ల గణేష్.. ఫస్ట్ మూవీ ఎవరితో?

Bandla Ganesh: బీజీ బ్లాక్ బస్టర్స్ అనౌన్స్.. మళ్లీ ప్రొడ్యూసర్‌గా బండ్ల గణేష్.. ఫస్ట్ మూవీ ఎవరితో?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 30, 2025
03:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

బండ్ల గణేష్ కేవలం స్టార్ కమెడియన్ మాత్రమే కాదు, నిర్మాతగా కూడా గుర్తింపు పొందాడు. నిర్మాతగా గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరమ్మాయిలతో, గోవిందుడు అందరివాడేలే, టెంపర్ వంటి హిట్ సినిమాలను నిర్మించిన అతను, కొంతకాలం బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్లీ నిర్మాణ రంగంలోకి మళ్లి అడుగుపెట్టాడు. ఇటీవల తన సెకండ్ బ్యానర్‌ను ప్రకటించాడు. డిసెంబర్ 30న బండ్ల గణేష్ తన కొత్త నిర్మాణ సంస్థ బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్స్ (బీజీ బ్లాక్ బస్టర్స్)ను అధికారికంగా లాంచ్ చేశాడు. ఇంతకుముందు పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై సినిమాలు నిర్మించిన ఆయన, ఇప్పుడు కొత్త బ్యానర్ కింద సినిమాలను నిర్మించబోతున్నాడు.

Details

ఆంజనేయులతో మొదటి సినిమా ప్రొడ్యూస్

బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ప్రకటిస్తూ నా సెకండ్ బ్యానర్ బీజీ బ్లాక్ బస్టర్స్ ను గర్వంగా ప్రకటిస్తున్నాను. ఇక్కడ కాంప్రమైజ్ కాని సినిమాలను చాంపియన్ స్థాయిలో తెరకెక్కించేందుకు కృషి చేస్తాము. బౌండరీలను దాటే, గుండెలను కదిలించే కథలను తెస్తామన్నారు. నటుడిగా స్థిరమైన తరువాత, గణేష్ 2009లో రవితేజ హీరోగా "ఆంజనేయులు"తో ప్రొడ్యూసర్‌గా అడుగు పెట్టాడు. తరువాత పవన్ కళ్యాణ్‌తో తీన్ మార్, గబ్బర్ సింగ్ సినిమాలను నిర్మించి, 2013లో బాద్ షా, ఇద్దరమ్మాయిలతో, నీ జతగా నేనుండాలి చిత్రాలను ప్రొడ్యూస్ చేశాడు.

Details

రెండోవ ఇన్నింగ్స్ ప్రారంభించిన బండ్ల

గోవిందుడు అందరివాడేలే, టెంపర్ సినిమాలతో తన నిర్మాతగా గుర్తింపును మరింత పెంచుకున్నాడు. 2015లో టెంపర్ తర్వాత, కొంతకాలం గణేష్ కొత్త ప్రాజెక్ట్ తీసుకోలేదు. నటుడిగా కూడా గణేష్ 2008-2012 మధ్య బ్రేక్ తీసుకున్నాడు. తర్వాత బిజినెస్ మ్యాన్‌లో చిన్న క్యారెక్టర్ చేసి, 2020లో సరిలేరు నీకెవ్వరూతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఇప్పుడు బీజీ బ్లాక్ బస్టర్స్‌తో ప్రొడ్యూసర్‌గా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆయన, ఈ బ్యానర్ కింద ఏ హీరోతో మొదటి సినిమా చేస్తాడో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement