Page Loader
Nithya Menen: ఒంటరిగా ఉండటం లోపం కాదు.. నిత్యా మేనన్ భావోద్వేగ వ్యాఖ్యలు!
ఒంటరిగా ఉండటం లోపం కాదు.. నిత్యా మేనన్ భావోద్వేగ వ్యాఖ్యలు!

Nithya Menen: ఒంటరిగా ఉండటం లోపం కాదు.. నిత్యా మేనన్ భావోద్వేగ వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 23, 2025
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి నిత్యామీనన్, తన తాజా చిత్రం 'సార్ మేడమ్' ద్వారా మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. జూలై 25న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నిత్యా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేమ, సంబంధాలపై ఆమె తన వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకున్నారు. నిత్యా మాట్లాడుతూ ఒకప్పుడు ప్రేమకు నా జీవితంలో చాలా ప్రాధాన్యత ఉండేది. జీవితంలో సోల్‌మేట్ అవసరం అనిపించేది. అలాంటి వ్యక్తిని వెతికిన అనుభవమూ ఉంది. కానీ కాలక్రమేణా నా ఆలోచనలు మారాయి. జీవితం ఎవరో ఒకరిపై ఆధారపడి ఉండాల్సిన అవసరం లేదని అర్థమైంది. ఒక్కరే ఉండటం లోపం కాదు.

Details

రతన్ టాటా కూడా పెళ్లి చేసుకోలేదు కదా

రతన్ టాటా కూడా పెళ్లి చేసుకోలేదు కదా అని అన్నారు. అలాగే జీవితంలో పెళ్లి జరగకపోతే పెద్ద విషయం కాదు. కొన్నిసార్లు ఒంటరిగా ఉన్న అనుభూతి కలుగుతుంది. అయినప్పటికీ నేను ఈ స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నాను. ఈ స్థితికి నన్ను తీసుకొచ్చినవే నా అనుభవాల పాఠాలు. ఏదైనా జరిగినా అది మన మంచికే అనుకోవడం నేర్చుకున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం నిత్యా మాట్లాడిన ఈ విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఈ మాటలు, ప్రేమపై ఆమె తాజా దృక్పథాన్ని స్పష్టంగా తెలిపాయి.