BSS12: బెల్లంకొండ బర్త్ డే.. BSS12 స్టన్నింగ్ పోస్టర్ రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యాక్టర్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుసగా కొత్త సినిమాలతో బిజీగా ఉన్నాడు.
ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో ఒకటి BSS12. ఇది ఒక మిస్టిక్ థ్రిల్లర్.
ఈ చిత్రాన్ని లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహించగా, మహేశ్ చందు నిర్మిస్తున్నారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బర్త్‌డే సందర్భంగా తాజాగా ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ పోస్టర్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొండ మీద అటవీ ప్రాంతంలో గాలులు, మంటల మధ్య రైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానులను ఆకట్టుకుంటోంది.
పోస్టర్‌లో"త్వరలోనే హై ఆక్టేన్ ఎక్స్‌పీరియెన్స్‌ను అనుభవించేందుకు రెడీగా ఉండండి"అంటూ విడుదల చేశారు.ఇది సినిమాపై భారీగా క్యూరియాసిటీని పెంచుతోంది.
వివరాలు
ఫీమేల్ లీడ్ రోల్ లో సంయుక్తా మీనన్
ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్‌ను భీమ్లానాయక్ చిత్రంతో గుర్తింపు పొందిన సంయుక్తా మీనన్ పోషిస్తోంది.
ఆమె పాత్రకు సంబంధించిన స్టైలిష్, ట్రెండీ లుక్‌ను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు.
సంయుక్తా ఇందులో సమీర పాత్రలో నటిస్తుంది.
ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు, అలాగే దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీని నిర్వర్తిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ చేసిన ట్వీట్
Amidst blazing fire and winds..
— BA Raju's Team (@baraju_SuperHit) January 3, 2025
He’s ready to ride and push every limit 🔥
Team #BSS12 sends fierce birthday wishes to @BSaiSreenivas ❤️🔥
A high octane experience awaits on the big screens soon! 💥
#HBDBellamkondaSaiSreenivas @iamsamyuktha_ #MaheshChandu @saishashank4u… pic.twitter.com/2lgtxkjErY