Page Loader
IIFA 2024:: 'ఐఫా'లో 'యానిమల్' సత్తా.. షారుక్‌ ఖాన్‌కి ఉత్తమ నటుడు అవార్డు
'ఐఫా'లో 'యానిమల్' సత్తా.. షారుక్‌ ఖాన్‌కి ఉత్తమ నటుడు అవార్డు

IIFA 2024:: 'ఐఫా'లో 'యానిమల్' సత్తా.. షారుక్‌ ఖాన్‌కి ఉత్తమ నటుడు అవార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 29, 2024
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ (ఐఫా) అవార్డులు అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుక అబుదాబిలో జరిగింది. మొదటి రోజు దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన సినిమాలు, ప్రముఖులు పురస్కారాలను అందుకున్నారు. రెండో రోజు బాలీవుడ్‌ సినిమాలు, నటీనటులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ అవార్డుల కార్యక్రమంలో 'యానిమల్‌' సినిమా వివిధ విభాగాల్లో అనేక అవార్డులు గెలుచుకుంది. అలాగే, షారుక్‌ ఖాన్‌ నటించిన 'జవాన్‌'కు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఇందులో షారుక్‌ ఖాన్‌ ఉత్తమ నటుడిగా అవార్డు లభించడం విశేషం. అందుకోవడం విశేషం.

Details

ఐఫా 2024 విజేతలు వీరే

ఉత్తమ చిత్రం: యానిమల్‌ ఉత్తమ నటుడు: షారుక్‌ ఖాన్‌ (జవాన్‌) ఉత్తమ నటి: రాణీ ముఖర్జీ (మిసెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే) ఉత్తమ దర్శకుడు: విదు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌) ఉత్తమ సహాయ నటుడు: అనిల్‌ కపూర్‌ (యానిమల్‌) ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ ) ఉత్తమ విలన్‌: బాబీ దేవోల్‌ (యానిమల్‌) ఉత్తమ కథ: రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ ఉత్తమ కథ (Adapted): 12th ఫెయిల్‌ ఉత్తమ సంగీతం: యానిమల్‌ ఉత్తమ లిరికల్స్‌: యానిమల్‌ (సిద్ధార్థ్-గరిమే, సత్రన్యాగ)