LOADING...
Betting App Case : బెట్టింగ్ యాప్ కేసు.. సినీ-టీవీ సెలబ్రిటీలపై సిట్ విచారణ వేగం
బెట్టింగ్ యాప్ కేసు.. సినీ-టీవీ సెలబ్రిటీలపై సిట్ విచారణ వేగం

Betting App Case : బెట్టింగ్ యాప్ కేసు.. సినీ-టీవీ సెలబ్రిటీలపై సిట్ విచారణ వేగం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 22, 2025
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

బెట్టింగ్ యాప్ కేసులో సిట్‌ దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. సినీ, టీవీ రంగాలకు చెందిన 25 మంది సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 22 మంది నుండి స్టేట్‌మెంట్లు రికార్డు చేసినట్లు సిట్ వెల్లడించింది. ఇప్పటికే వాంగ్మూలాలు ఇచ్చినవారిలో టాలీవుడ్‌ నటులు దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, అనన్య నాగళ్ళ ఉన్నారు. అలాగే యాంకర్లు విష్ణు ప్రియా, శ్యామల, హర్ష సాయి, టేస్టీ తేజతో పాటు మరికొందరి స్టేట్‌మెంట్లు కూడా సిట్ రికార్డు చేసింది. ఇంకా మంచు లక్ష్మి, రీతు చౌదరి, భయ్యా సన్నీ యాదవ్ స్టేట్‌మెంట్లు ఇవ్వాల్సి ఉంది.

Details

స్టేట్‌మెంట్లు పూర్తయ్యాక తుది నిర్ణయం

వీరిలో రీతు చౌదరి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉండగా, సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నాడు. మంచు లక్ష్మి అయితే కొంత సమయం కావాలని సిట్‌ను కోరింది. ఇప్పటివరకు స్టేట్‌మెంట్లు ఇచ్చిన సెలబ్రిటీలను బెట్టింగ్ యాప్‌లను ఎందుకు, ఏ కారణాలతో ప్రమోట్ చేసారన్న అంశంపై సిట్ క్షుణ్ణంగా ప్రశ్నించింది. ఈ ప్రమోషన్‌కు వారికి ఎంత పారితోషకం ఇచ్చారు? కేవలం పారితోషకమేనా, లేక మరేదైనా ప్రయోజనం ఉన్నదా? — అన్న విషయాలను సిట్ అధికారులు స్పష్టంగా విచారించారు. మొత్తం 25 మంది స్టేట్‌మెంట్లు పూర్తయ్యాక, సిట్‌ తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటివరకు ఇచ్చిన వాంగ్మూలాలను సమగ్రంగా పరిశీలించిన తరువాత మాత్రమే ముందడుగు వేస్తామని అధికారులు తెలిపారు.