Page Loader
భగవంత్ కేసరి టీజర్: పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో అదరగొట్టిన బాలయ్య
భగవంత్ కేసరి టీజర్

భగవంత్ కేసరి టీజర్: పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో అదరగొట్టిన బాలయ్య

వ్రాసిన వారు Sriram Pranateja
Jun 10, 2023
11:35 am

ఈ వార్తాకథనం ఏంటి

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న భగవంత్ కేసరి సినిమా నుంచి టీజర్ విడుదలైంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా రిలీజైన ఈ టీజర్, అభిమానులకు ఆకట్టుకునేలా ఉంది. బాలకృష్ణతో సినిమా అంటే ఎలాంటి అంశాలు ఉండాలని అభిమానులు కోరుకుంటారో అలాంటి అంశాలన్నీ టీజర్ లో కనిపించాయి. టీజర్ మొదట్లోనే, రాజు తన వెనకాల ఉన్న మందను చూపిస్తాడు, మొండోడు తన గుండెను చూపిస్తాడు అనే పవర్ ఫుల్ డైలాగ్ వినిపించింది. ఆ తర్వాత యాక్షన్ సీన్లు కనిపించాయి. బాలకృష్ణ చెప్పిన హిందీ డైలాగ్ అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. బాలయ్య లుక్, డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్, మొదలైనవన్నీ టీజర్ ని మళ్ళీ మళ్ళీ చూసేలా చేస్తున్నాయి.

Details

అనిల్ రావిపూడి మార్క్ 

దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాలంటే కామెడీని అభిమానులు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. టీజర్‌లో ఎన్ని యాక్షన్ సీన్లు ఉన్నా, సినిమాలో కామెడీ పుష్కలంగా ఉందని చెప్పడానికి టీజర్ చివర్లో బాలకృష్ణ చేత కామెడీ చేయించిన సీన్ కనిపిస్తుంది. అటు అనిల్ రావిపూడి మార్క్, ఇటు బాలయ్య అభిమానుల అంచనాలు.. అన్నింటినీ బ్యాలన్స్ చేస్తూ భగవంత్ కేసరి ఉండబోతుందని అర్థమవుతోంది. హీరోయిన్స్ ఎక్కడ? టీజర్ మొత్తంలో నిరాశపరిచే అంశం ఏదైనా ఉందంటే అది హీరోయిన్స్ కనిపించకపోవడమే. కాజల్ అగర్వాల్ కానీ, శ్రీలీల కానీ ఎక్కడా కనిపించలేదు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా, దసరా కానుకగా విడుదల అవుతుందని చిత్రబృందం వెల్లడి చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భగవంత్ కేసరి టీజర్