Page Loader
భగవంత్ కేసరి మొదటి పాట రిలీజ్ పై మోక్షజ్ఞ అప్డేట్: వినాయక చవితికి స్పీకర్లు పగిలిపోతాయ్ 
గణ గణ గణేశా అంటూ మొదటి పాట రిలీజ్ అవుతుందని మోక్షజ్ఞ అప్డేట్

భగవంత్ కేసరి మొదటి పాట రిలీజ్ పై మోక్షజ్ఞ అప్డేట్: వినాయక చవితికి స్పీకర్లు పగిలిపోతాయ్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 17, 2023
02:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

వీరసింహారెడ్డి తర్వాత బాలకృష్ణ నుండి వస్తున్న చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటివరకు చిన్న గ్లింప్స్ మాత్రమే విడుదలైంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా నుండి మొదటి పాట ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. తాజాగా మొదటి పాట విషయమై బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ అప్డేట్ ఇచ్చారు. భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్ లోడ్ అవుతుందని, గణ గణ గణేశా పాటతో వినాయక చవితినాడు స్పీకర్స్ పగిలిపోతాయని మోక్షజ్ఞ ట్వీట్ చేశారు. భగవంత్ కేసరి సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. బాలకృష్ణ కూతురు పాత్రలో శ్రీలీల కనిపించనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మోక్షజ్ఞ ట్వీట్