Page Loader
బాలయ్య భగవంత్ కేసరి విడుదల వాయిదాపై క్లారిటీ 
భగవంత్ కేసరి విడుదల పుకార్లపై క్లారిటీ

బాలయ్య భగవంత్ కేసరి విడుదల వాయిదాపై క్లారిటీ 

వ్రాసిన వారు Sriram Pranateja
Sep 18, 2023
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం భగవంత్ కేసరి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీలీల బాలకృష్ణ కుమార్తెగా నటిస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా వాయిదా పడుతుందని అనేక వార్తలు వచ్చాయి. అక్టోబర్ 19వ తేదీన విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడనుందని ప్రచారం జరిగింది. తాజాగా సినిమా విడుదల వాయిదా వార్తలపై క్లారిటీ వచ్చేసింది. ఈరోజు వినాయక చవితి సందర్భంగా భగవాన్ కేసరి సినిమా మేకర్స్ నుండి ఒక వీడియో రిలీజ్ అయింది. ఈ వీడియోలో భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19వ తేదీన విడుదలవుతుందని మేకర్స్ వెల్లడి చేశారు. అంటే వాయిదా వార్తలన్నీ అబద్ధమేనని తేలిపోయింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భగవంత్ కేసరి మేకర్స్ చేసిన ట్వీట్