
బాలయ్య అభిమానులకు పండగలాంటి వార్త: భగవంత్ కేసరి టీజర్ విడుదలకు టైమ్ ఫిక్స్
ఈ వార్తాకథనం ఏంటి
బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాను భగవంత్ కేసరి అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే భగవంత్ కేసరి టీజర్ ను బాలయ్య బర్త్ డే సందర్భంగా జూన్ 10వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
తాజాగా ఈ విషయమై అప్డేట్ వచ్చింది. బాలయ్య పుట్టినరోజు నాడు ఉదయం 10:19గంటలకు భగవంత్ కేసరి టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటన చేసారు.
ఇప్పటికే రిలీజైన టైటిల్ పోస్టర్, అభిమానులకు బాగా నచ్చేసింది. కొత్త అవతారంలో బాలయ్య కనిపించేసరికి అభిమానులు అందరూ టీజర్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీల నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, విలన్ గా కనిపిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టీజర్ కు టైమ్ ఫిక్స్ చేసిన చిత్రబృందం
Muhurtham Fix💥
— Shine Screens (@Shine_Screens) June 9, 2023
Get Ready for the Mass Feast from#BhagavanthKesari 🔥
TEASER LAUNCH TOMORROW at 10:19 AM IST 🤩
In 108 Theatres Worldwide💥#NandamuriBalakrishna@AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi… pic.twitter.com/qphCw181yC