Page Loader
భగవంత్ కేసరి ప్రమోషన్స్: ఈ తరం హీరోయిన్లకు శ్రీలీల ఆదర్శం.. కాజల్ అగర్వాల్ 
శ్రీలీలపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన కాజల్ అగర్వాల్

భగవంత్ కేసరి ప్రమోషన్స్: ఈ తరం హీరోయిన్లకు శ్రీలీల ఆదర్శం.. కాజల్ అగర్వాల్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Oct 12, 2023
03:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైనా కాజల్ అగర్వాల్ ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భగవంత్ కేసరి చిత్రం అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లు జోరుగా మొదలయ్యాయి. అయితే ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడిన కాజల్ అగర్వాల్, శ్రీలీల గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. శ్రీలీల చాలా తెలివైనదని, అందరితోనూ చాలా సరదాగా ఉంటుందని ప్రతిదీ ప్లానింగ్ తో చేస్తుందని కాజల్ అగర్వాల్ అన్నారు.

Details

ఈ తరం హీరోయిన్లు శ్రీలీల మాదిరిగా ఉండాలంటున్న కాజల్ అగర్వాల్ 

అంతేకాదు ఏ విషయాన్నైనా ఛాలెంజ్ గా తీసుకుంటుందని, ఈ తరం హీరోయిన్లకు శ్రీలీల ఆదర్శంగా నిలుస్తుందని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల కనిపించనుంది. భగవంత్ కేసరి ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారం తండ్రీ కూతుర్ల మధ్య బంధం అద్భుతంగా ఉండబోతుందని తెలిసింది.ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన వచ్చింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్లో రూపొందిన భగవంత్ కేసరి సినిమాను సాహు గారపాటి. హరీష్ పెద్ది నిర్మించారు. ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ కనిపించారు.