Loading...
Bhagyashri Borse: సినిమాల్లోకి రావాలని చెప్పగానే వాట్సాప్‌లో బ్లాక్ చేశారు: భాగ్యశ్రీ బోర్సే
సినిమాల్లోకి రావాలని చెప్పగానే వాట్సాప్‌లో బ్లాక్ చేశారు: భాగ్యశ్రీ బోర్సే

Bhagyashri Borse: సినిమాల్లోకి రావాలని చెప్పగానే వాట్సాప్‌లో బ్లాక్ చేశారు: భాగ్యశ్రీ బోర్సే

వ్రాసిన వారు Moogati Shabari
Jul 28, 2026
10:27 am

ఈ వార్తాకథనం ఏంటి

తన నటనా ప్రయాణం ప్రారంభ దశలో కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభించలేదని నటి భాగ్యశ్రీ బోర్సే వెల్లడించారు. అఖిల్ సరసన నటించిన 'లెనిన్' చిత్రం ఇటీవల బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసిన సందర్భంగా ఆమె ఓ కళాశాలలో నిర్వహించిన టాక్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన రోజులను గుర్తు చేసుకుంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. భాగ్యశ్రీ మాట్లాడుతూ.. "సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్న తర్వాత మొదట మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను. అయితే ఆమె వెంటనే ఆ ఆలోచనను తిరస్కరించింది. తర్వాత నాన్నతో మాట్లాడితే, 'అమ్మ వద్దన్న తర్వాత ఎలా వెళ్తావు?' అని ప్రశ్నించారు.

వివరాలు

ఆ విషయాన్ని పంచుకున్న హీరోయిన్..

కనీసం అక్క అయినా నా నిర్ణయానికి మద్దతు ఇస్తుందేమోనని ఆశించి ఆమెకు ఫోన్ చేస్తే, 'అమ్మానాన్నలు వద్దంటున్నారు కదా' అంటూ ఆమె కూడా నిరాకరించింది.

కుటుంబ సభ్యులంతా అడ్డుకున్నప్పటికీ నటనపై ఉన్న ఆసక్తి తగ్గలేదు.

అందుకే ఆడిషన్లకు హాజరవడం ప్రారంభించాను. అలా నేను సినీ అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టిన తర్వాత ఇంట్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

మా అమ్మ నన్ను వాట్సాప్‌లో బ్లాక్ చేసింది. దాదాపు ఆరు నెలల పాటు నాతో మాట్లాడలేదు.

వివరాలు

విద్యార్థులకు సందేశం..

ఇప్పుడు ఆ విషయాలను నవ్వుకుంటూ చెప్పగలుగుతున్నా, ఆ రోజుల్లో మాత్రం ఎంతో మానసికంగా బాధ అనుభవించాను" అని ఆమె తెలిపారు.

సినీ పరిశ్రమ గురించి తల్లిదండ్రుల్లో సహజంగానే కొన్ని భయాలు, ఆందోళనలు ఉంటాయని భాగ్యశ్రీ పేర్కొన్నారు.

అయితే జీవితంలో తర్వాత పశ్చాత్తాపం కలగకుండా ఉండాలంటే కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలను ధైర్యంగా, ఆలోచించి తీసుకోవాలని సూచించారు.

ముఖ్యంగా ఏ లక్ష్యాన్నైనా సాధించాలంటే ముందుగా మన సామర్థ్యంపై మనకే నమ్మకం ఉండాలని ఆమె విద్యార్థులకు సందేశం ఇచ్చారు.

ADVERTISEMENT