Ilayaraja : ఇళయరాజా సంగీత ప్రతిభకు భారతరత్న ప్రతిపాదన.. సీఎం స్టాలిన్ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ సంగీతాన్ని విప్లవాత్మక మార్పులతో సమృద్ధిగతం చేసిన దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా పేరు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. భారతీయ సినిమా సంగీతానికి ప్రతీకగా ఈ ప్రముఖ సంగీతకారుడికి 'భారతరత్న' ఇవ్వాలని, తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. ఈ విషయం ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ చెన్నైలో జరిగిన ప్రత్యేక సన్మాన కార్యక్రమంలో ప్రకటించారు. ఇళయరాజా సినీ ప్రయాణం 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు.
Details
కేంద్రానికి ప్రతిపాదన
ఇళయరాజా నిరంతరం కృషి, నైపుణ్యంతో ఉన్నత స్థాయిని చేరుకున్నారని సీఎం స్టాలిన్ చెప్పారు. సంగీతం ఆయనకు జీవితం, భావోద్వేగాలను మేల్కొలిపే శక్తి అని పేర్కొన్నారు. ఆయన సేవలను గుర్తిస్తూ భారతరత్నకు ప్రతిపాదిస్తున్నామని ప్రకటించారు. ఇళయరాజా పేరుతో ప్రతేడాది ప్రత్యేక సంగీత పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతిభావంతులైన కళాకారులను గౌరవిస్తామని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, మంత్రి సామినాథన్, సినీ లెజెండ్స్ రజనీకాంత్, కమల్ హాసన్ హాజరయ్యారు.