Yamini Krishnamurthy: భారతనాట్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత
ప్రముఖ భారత నాట్యం, కూచిపూడిలో ప్రసిద్ధి చెందిన యామినీ కృష్ణమూర్తి(84) కాసేపటి క్రితం కన్నుముశారు. వయో సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమె దిల్లీలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. 1940లో ఆంధ్రప్రదశ్‌లోని మదనపల్లెలో ఆమె జన్మించారు. దేశ, విదేశాల్లో ఇప్పటివరకూ ఎన్నో ప్రదర్శనలిచ్చి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆమెకు పద్మశ్రీ, సంగీతనాటక, అకాడమీ అవార్డు, పద్మభూషణ్ పురస్కాలను అందుకుంది. గతంలో తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన నర్తకిగానూ ఆమె సేవలందించిన విషయం తెలిసిందే.