భోళాశంకర్ సినిమాలో తెలంగాణ ఫేమస్ ఫోక్ సాంగ్: ఇప్పుడే రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళాశంకర్ సినిమా నుండి ఇంతకుముందు జామ్ జామ్ జజ్జనక పాట రిలీజైంది. డప్పేసుకో, దరువేసుకో, వవ్వారే అదిరే పాటేస్కో అంటూ సాగే ఈ పాట, ఆద్యంతం ఆసక్తిగా ఉంది. పార్టీ సాంగ్ మాదిరిగా డ్యాన్స్ వేయాలనిపించే ట్యూను, ఒక్కసారి వినగానే పెదాల మీద నుండి వెళ్ళిపోని సాహిత్యం, స్క్రీన్ మీద కనిపించే రంగురంగుల అందాలు అన్నీ కలిసి పాటకు మంచి అందాన్ని తీసుకొచ్చాయి. ఈ పాటలో మరో స్పెషాలిటీ ఉంది. తెలంగాణ ఫేమస్ జానపదం అయిన నర్సపెల్లి పాటకు ఇందులో మరో వెర్షన్ ని ఇచ్చారు. నర్సపెల్లి గండిలోన గంగధరి నాటుపిల్లే కలిసినాది గంగధరి అంటూ సరికొత్త లిరిక్స్ జోడించి అద్భుతంగా తీర్చిదిద్దారు.
అనురాగ్ కులకర్ణి, మంగ్లి గొంతులోంచి వచ్చిన పాట
జామ్ జామ్ జజ్జనక అనే పాటను కాసర్ల శ్యామ్ రాసారు. అనురాగ్ కులకర్ణి, మంగ్లి గొంతులో పాట మొత్తం ఆసక్తిగా వినిపించింది. మహతి స్వర సాగర్ అందించిన సంగీతం బాగుంది. ఈ పాటలో అటు తమన్నా, ఇటు కీర్తి సురేష్ కనిపించారు. ఇది పార్టీ సాంగ్ అని చెప్పారు కానీ అసలు పార్టీ దేనికోసమో వెల్లడి చేయలేదు. మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న భోళాశంకర్ సినిమాను ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర్ నిర్మించారు. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఆగస్టు 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతుంది.