LOADING...
ఘనంగా ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్- 7.. కంటెస్టెంట్స్ ఎవరెవరో తెలుసా
కంటెస్టెంట్స్ ఎవరెవరో తెలుసా

ఘనంగా ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్- 7.. కంటెస్టెంట్స్ ఎవరెవరో తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 04, 2023
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉల్టా-పల్టా అంటూ ఆదివారం ప్రారంభమైన బిగ్‌బాస్ 7 తొలి ఎపిసోడ్‌తోనే నాగార్జున ఆసక్తి పెంచేశారు. ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా ఎవరు కనిపించబోతున్నారోన్న ఉత్కంఠకు తెరపడిపోయింది. రియల్ కంటెస్టెంట్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసి అలరించారు. మరోవైపు నాగార్జున మారోసారి బిగ్ బాస్ హోస్టుగా మెరవనున్నారు. సోమవారం-శుక్రవారం రాత్రి 9.30 గంటలకు బిగ్‌బాస్ షో సందడి చేయనుంది. డిస్నిప్లస్ హాట్ స్టార్లో 24 గంటలు లైవ్ స్ట్రీమ్ కానుంది. 1.తొలి కంటెస్టెంట్‪‌గా సీరియల్ యాక్ట్రెస్ ప్రియాంక జైన్ ఎంట్రీ ఇచ్చింది. 2. శివాజీ 3. దామిని 4. ప్రిన్స్ యావర్ 5. శుభశ్రీ 6. షకీలా 7. ఆట సందీప్ 8. శోభాశెట్టి 9. టేస్టీ తేజ

DETAILS

తొలి ఐదుగురు కంటెస్టెంట్‌లకు నాగార్జున బంపర్ ఆఫర్

10. రతిక రోజ్11. గౌతమ్ 12. కిరణ్ రాథోడ్ 13. పల్లవి ప్రశాంత్ 14. అమర్‌ దీప్ ఈ పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ షోలోకి ప్రవేశించాక, హీరో నవీన్ పోలిశెట్టి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే అతడ్ని హౌస్ లోకి పంపించి షోని ముగించారు.గత సీజన్ స్టార్టింగ్ ఎపిసోడ్ లోనే 20 మంది హౌస్ లోకి ప్రవేశించారు. సీజన్‌-7లో భాగంగా హౌస్‌లోకి వచ్చిన తొలి ఐదుగురు కంటెస్టెంట్‌లకు సూట్ కేస్‌లో రూ.20 లక్షలు పెట్టి నాగార్జున భారీ ఆఫర్‌ ఇచ్చారు.వెళ్లిపోవాలనుకున్న వారు ఆ మొత్తాన్ని తీసుకుని వెళ్లిపోవచ్చన్నారు. తొలుత ఎవరూ ముందుకు రాకపోయేసరికి రూ.5 లక్షలు చొప్పున పెంచుతూ రూ.35 లక్షల వరకు తీసుకెళ్లారు.నటుడు శివాజీ ఆసక్తి చూపినా చివర్లో వెనకడుగేశారు.

EMBED

ఆ 14 కంటెస్టెంట్‌లు ఎవరో చూడండి

All 14 HMs as of now. Who is your fav HM?#BiggBossTelugu7 pic.twitter.com/huptvaJvDl— BiggBossTelugu7 (@TeluguBigg) September 3, 2023