Big Boss 7 Telugu : నేడు బిగ్ బాస్ 7 ప్రారంభం.. ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్టును చూసేయండి!
తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొని, ఏడో సీజన్ లోకి అడుగుపెడుతోంది. ఆదివారం బిగ్‌బాస్ 7ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో మొత్తం 20మంది కంటెస్ట్‌ని బిగ్‌బాస్ యాజమాన్యం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోతో ఈ ఉల్టా పుల్టా సీజన్ ఎలా ఉండబోతుందనే దానికి ఓ శాంపిల్ చూపించారు. ఆట ఆదివారం రాత్రి 7గంటలకే అయినా ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వెళ్లిపోయి, ఆటను కూడా మొదలు పెట్టేశారు. ఈ ప్రాసెస్ మొత్తం నేటి రాత్రి 7 గంటలకు టెలికాస్ట్ చేయనున్నారు.
గెస్ట్‌లుగా హౌస్‌లోకి విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి
బిగ్ బాస్ హౌస్‌లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. వారిలో హీరో శివాజి, అమర్ దీప్ చౌదరి, ఆట సందీప్, మోడల్ ప్రిన్స్ యవార్, శుభ శ్రీ, ప్రియాంక జైన్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, యాక్టర్ క్రాంతి ఇప్పటికే హౌస్ లోకి వెళ్లిపోయారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండనుంది. గతంలో ఒకటే బెడ్ రూం ఉండగా, ప్రస్తుతం మూడు బెడ్ రూంలు ఉండనున్నాయి. దీంతో ఓ స్పెషల్ బెడ్ రూంను కూడా కేటాయించారు. తొలి రోజు గెస్ట్ లుగా హౌస్ లోకి విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టిలు రానున్నారు.