Big Films-2023 : ఈ 5 సినిమాలు ఈ ఏడాది బ్లాక్ బస్టర్.. అవేంటో తెలుసుకోండి
ఉత్తరాదిన బాలీవుడ్ మొదలు దక్షిణాదిన టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్ పరిశ్రమల్లో చాలా సినిమాలు 2023లో రిలీజ్ అయ్యాయి. అయినప్పటికీ వాటిల్లో బ్లాక్ బస్టర్ సాధించిన టాప్ 5 సినిమాల గురించి తెలుసుకుందాం. నట సింహం నందమూరి బాలకృష్ణ కథనాయకుడిగా నటించిన 'భగవంత్ కేసరి' బ్లాక్ బాస్టర్'గా నిలిచింది. దీంతో మరో సూపర్ హిట్ చిత్రం బాలయ్య తన ఖాతాలో వేసుకున్నారు. అక్టోబర్ 19న రిలీజ్ ఈ సినిమా థియేటర్లలో అనూహ్య కలెక్షన్లు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.130 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను భగవంత్ కేసరి దాటింది. భగవంత్ కేసరి నవంబర్ 23న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటి ప్లాట్ ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది.
కొత్త గెటప్'తో సరికొత్త డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్న బాలయ్య
ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఓ వైపు లియో, టైగర్ నాగేశ్వరరావు లాంటి పెద్ద సినిమాలు బరిలో ఉన్నా భగవంత్ కేసరి ఆరంభం నుంచి జోరు మీదే కొనసాగుతోంది. బాలకృష్ణ యాక్టింగ్, యాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీలీల చేపట్టిన సినిమా ప్రమోషన్స్ అలరించాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‍గా ఆడిపాడారు. ఇదే సమయంలో శ్రీలీల ముఖ్యమైన పాత్ర పోషించారు. క్లోజింగ్ కలెక్షన్స్ నైజాంలో 18 కోట్లు, సీడెడ్'లో 15.2 కోట్లు, ఉత్తరాంధ్రలో 6.75 కోట్లు, కృష్ణాలో 3.5 కోట్లు షేర్ రాబట్టింది. ఓవర్సీస్'లో 6.8కోట్లను సాధించగలిగింది.
'జవాన్' సినిమాతో అదరగొట్టిన బాలీవుడ్ బాద్ షా
బాలీవుడ్ బాద్'షా షారుక్ ఖాన్, సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన జవాన్ బాక్సాఫిస్ రికార్డులను కొల్లగొట్టింది. ఈ మేరకు ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలు చేసిన హీరోగా షారుఖ్ సరికొత్త చరిత్రను సృష్టించాడు. ఈ ఏడాది ప్రథమార్థంలో పఠాన్, ద్వితియార్థంలో జవాన్‌తో కలెక్షన్‌ల మోత మోగించారు షారుక్. ఇప్పటికే జవాన్ రూ.1150 కోట్లు కలెక్ట్ చేసి బాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త రికార్డును నమోదు చేసింది. మరోవైపు పఠాన్‌తో రూ.వెయ్యి కోట్లు కొల్లగొట్టారు. మరోవైపు ఈ సినిమా ఓటిటిలోనూ విడుదలైంది. థియేటర్‌లో ఈ సినిమా 2 గంటల 45 నిమిషాల నిడివితో రిలీజైంది.కానీ ఓటిటిలో మాత్రం 3 గంటలపైమాటేనని తెలుస్తోంది.
రూ.1000 కోట్లకుపైగా రెండు సార్లు వసూలు
ఇదే సమయంలో సౌత్ ఇండియాలోనూ షారుఖ్ సినిమాకు రూ.కోట్లు వసూలయ్యాయి.హిందీ ప్రేక్షకులు సైతం షారుఖ్ యాక్షన్, అట్లీ డైరెక్షన్'పై సంతృప్తిగా ఉన్నారు తొలిసారిగా ఓ ఇండియన్ హీరో ఒకే ఏడాదిలో వరుసగా రూ.1000కోట్లకుపైగా వసూలు సాధించిన సినిమాలు తీసి షారుఖ్ చరిత్రకెక్కాడు. ఈ సినిమాలో షారుఖ్‌కు జోడీగా నయనతార నటించింది. దీపికా అతిథి పాత్రలో కనిపించింది.విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు. షారుక్-అట్లీల కాంబోలో వచ్చిన 'జవాన్' హాలీవుడ్ అవార్డుల బరిలోనూ నిలిచింది.ఏటా 'హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్' అవార్డుల పండగ జరగనున్న విషయం తెలిసిందే. తాజాగా దీని పేరును 'అస్త్ర' అవార్డులుగా మార్చారు. 2024కుగానూ 'అస్త్ర'అవార్డుల కోసం నామినేట్ అయిన చిత్రాల జాబితాను సంస్థ ప్రకటించింది. షారుక్ నటించిన 'జవాన్' ఇందులో చోటు దక్కించుకుంది.
వాటితో పోటీ పడుతున్న జవాన్
ఫలితంగా భారత్ నుంచి నామినేట్ అయిన ఏకైక చిత్రంగా నిలిచింది. ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో 'జవాన్' వివిధ దేశాలకు చెందిన 10చిత్రాలతో పోటీపడనుంది. 'ఆర్ఆర్‌ఆర్' గతేడాది ఇదే అవార్డుల్లో ఇండియన్ సినిమా సత్తా చాటింది.ఐదు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఈసారి భారత్ నుంచి 'జవాన్' ఈ అవార్డుల బరిలో నిలుస్తోంది. దీంతో చిత్రబృందానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 2024 ఏడాది ఫిబ్రవరి 26న లాస్ ఏంజిల్స్‌లో ఈ అవార్డుల ప్రధానోత్సవ వేడుక జరగనుంది.
లియోతో బంపర్ విక్టరీ కొట్టిన దళపతి విజయ్
కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన తమిళ సినిమాలు వరుసగా తెలుగులోనూ డబ్ అవ్వుతున్నాయి. ఈ మేరకు టాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా మంచి వసూళ్లను రాబడుతున్నాయి. హీరో విజయ్ డైెరెక్టర్ లోకేష్ కనగరాజ్'తో తీసిన లియో సినిమా బ్లాక్ బస్టర్'గా నిలిచింది. మొదటి రెండు రోజులు ఈ సినిమాకు కాస్త పర్వాలేదు అనిపించినా తర్వాత క్రమంగా పుంజుకుని ఆశించిన వసూళ్లను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దాదాపుగా రూ. 500 కోట్ల గ్రాస్‌ను అందుకుని అదరగొట్టింది.ఇటు తెలుగులో బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి చేసుకుని లాభాల బాట పట్టింది. మరోవైపు విజయ్ సినీ కెరీర్'లోనే తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా 20కోట్ల మార్క్ అందుకుని రికార్డు సృష్టించింది.
యానిమల్, దసరాతో రికార్డులు కొల్లగొట్టిన స్టార్ హీరోస్
బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్, రష్మిక మందన్నలతో తెరకెక్కిన యానిమల్ సినిమా బాక్సాఫీసును షేక్ చేస్తోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే 500 కోట్ల వసూళ్లకు చేరువగా వెళ్లింది. సందీప్ రెడ్డి వంగా తొలిసారి నేరుగా తీసిన పాన్ ఇండియా సినిమా యానిమల్ దాదాపుగా రూ.563 కోట్ల వసూళ్లను సాధించింది. డిసెంబర్ 1న విడుదలై కలెక్షన్ల పరంగా బాక్సాఫీసును కొల్లగొడుతోంది. రూ.100 కోట్ల రేంజ్'లోకి చేరిన నాని : నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'దసరా' ఆయన సినీకెరీర్'లోనే తొలి పాన్ ఇండియా రేంజ్'లో విడుదలైంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందించిన 'దసరా'లో కీర్తి సురేష్ జంటగా వచ్చిన సినిమా ఇప్పటికే రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి చేరింది.