ఇంట్లోకి ఆమె రాకూడదంటూ కోర్టు ఆదేశాలు: కోర్టులో నరేష్ కు రిలీఫ్
సీనియర్ నటుడు నరేష్, ఆయన మూడవ భార్య మధ్య వివాదాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్ లోని తన నివాసానికి రమ్య రఘుపతి రాకూడదంటూ నటుడు నరేష్ కోర్టులో పిటీషన్ వేసారు. తాజాగా ఈ విషయమై నరేష్ కు కోర్టులో ఊరట లభించింది. రమ్య రఘుపతిని నరేష్ ఇంటికి వెళ్ళకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే రమ్య రఘుపతి వేసిన మరో పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. నరేష్, పవిత్రా లోకేష్ జంటగా నటించిన మళ్ళీ పెళ్ళి సినిమా కథ, తన నిజ జీవిత కథను పోలి ఉందని రమ్య రఘుపతి ఆరోపించారు. ఆ సినిమా విడుదలను ఆపాలని కోర్టును ఆమె ఆశ్రయించారు.
సెన్సార్ సర్టిఫికెట్ పొందిన తర్వాత సినిమాను అడ్డుకోలేరని కోర్టు వ్యాఖ్య
మళ్ళీ పెళ్ళి సినిమా విడుదల విషయమై రమ్య రఘుపతి వేసిన పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. మళ్ళీ పెళ్ళి చిత్రం పూర్తిగా కల్పిత కథ అని కోర్టు తెలియజేసింది. అదీగాక ఒకసారి సెన్సార్ బోర్డ్ నుండి కల్పిత కథ అని సర్టిఫికెట్ పొందిన తర్వాత ఆ సినిమా విడుదలను ప్రైవేటు వ్యక్తులు ఎవరూ అడ్డుకోలేరని కోర్టు అంది. అదలా ఉంచితే, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నరేష్ చాలా బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన నటించిన సామజవరగమన చిత్రం సూపర్ సక్సెస్ అందుకుంది. ఆ సినిమాలో నరేష్ నటనకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.