Nani : 'ప్యారడైజ్' సినిమాలో పెద్ద ట్విస్ట్.. పవర్ ఫుల్ పాత్రలో పీపుల్ స్టార్!
ఈ వార్తాకథనం ఏంటి
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు.
హీరోగా నటించడమే కాకుండా, నిర్మాతగా కూడా సినిమాలు చేస్తూ తన ప్రతిభను నిరూపించుకుంటున్నాడు.
నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'హిట్ 3'. శైలేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇటీవలే టీజర్ విడుదల కాగా, నాని ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని కనిపించనున్నాడు.
Details
'ప్యారడైజ్' తో మరో మాస్ ఎంటర్టైనర్
'హిట్ 3' అనంతరం, నాని మరో యాక్షన్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.
'దసరా' సినిమాతో భారీ హిట్ అందించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాకు 'ప్యారడైజ్'తఅనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేశారు.
తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల కాగా, అది సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఈ చిత్రంలో నాని మరోసారి తెలంగాణ యాసలో మాస్ లుక్‌తో కనిపించనున్నాడు.
Details
'ప్యారడైజ్' లో పీపుల్ స్టార్!
ఇంతవరకు నాని సినిమాలో మరో స్టార్ నటిస్తున్నారనే విషయం బయటకురాలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం, 'ప్యారడైజ్' సినిమాలో పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి నటించనున్నారని తెలుస్తోంది.
ఈ చిత్రంలో ఆయన ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. టాప్ నాచ్ టెక్నీషియన్లు, పలు ప్రముఖ నటీనటులతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, ఆదివారం తఆర్. నారాయణ మూర్తిని కలిశారు.
ఈ సందర్భంగా దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ 'కామ్రేడ్' అంటూ పోస్ట్ చేశారు. ఈ ఫోటో వైరల్ అవుతుండటంతో, 'ప్యారడైజ్' సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.