Page Loader
NTR 31: ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్‌ మూవీ బిగ్ అప్డేట్

NTR 31: ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్‌ మూవీ బిగ్ అప్డేట్

వ్రాసిన వారు Sirish Praharaju
May 20, 2023
06:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కె.జి.యఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మేకర్స్ బిగ్ అప్డేట్ ను ప్రకటించింది. ఎన్టీఆర్ కి విషెస్ చెబుతూ.. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్లు ప్రకటించింది. మైత్రి మూవీ మేకర్స్ ,NTR ఆర్ట్స్ బ్యానర్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 'దేవర' అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ నటి జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా, విలన్ గా ప్రముఖ హీరో సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

NTR31 పై చిత్రబృందం చేసిన ట్వీట్