బిగ్ బాస్ పోయినా, సినిమా ఆఫర్ వచ్చింది.. హీరోయిన్ గా సందడి చేయబోతున్న రతికా రోజ్
బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో నాలుగు వారాలపాటు సందడి చేసిన రతికా రోజ్ ని ఎవ్వరూ మర్చిపోలేరు. హౌస్ లోకి ఎంటర్ అయినప్పటి నుండి తనదైన స్ట్రాటజీతో గేమ్ ఆడింది. అయితే ఆమె స్ట్రాటజీ బెడిసి కొట్టింది. మొదటగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తో స్నేహంగా ఉన్నా రతికా రోజ్, ఆ తర్వాత అతనితో స్నేహాన్ని తగ్గించేసింది. అంతేకాకుండా అతని మీద నెగిటివ్ కామెంట్లు చేయడం వల్ల ఇటు ప్రేక్షకులలో ఆమెపై నెగటివిటీ పెరిగిపోయింది. దీంతో నాలుగో వారంలో బిగ్ బాస్ హౌస్ నుండి రతికా ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత రతికాకు హీరోయిన్ గా అవకాశం వచ్చింది.
రాఘవేంద్రరావు దర్శకత్వంలో హీరోయిన్ గా రతికా రోజ్
రతికా రోజ్ ఇప్పుడు హీరోయిన్ గా కొత్త అవతారం ఎత్తనుంది. అది కూడా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించనుంది. ఈ మేరకు రతికా రోజ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడి చేసింది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం వెతుకుతుండగా రతికా రోజ్ ఆ పాత్రకు బాగా సూట్ అవుతుందని ఆమెను పిలిచారట. ఎమోషనల్ లవ్ స్టోరీ గా ఈ సినిమా తెరకెక్కుతోందని రతికా రోజ్ చెప్పుకొచ్చారు. మొత్తానికి బిగ్ బాస్ పోయినా కూడా హీరోయిన్ గా రతికా రోజ్ కి మంచి అవకాశం దక్కింది.