LOADING...
Shefali Jariwala: బిగ్‌బాస్ ఫేమ్ 'షఫాలీ' ఇకలేరు.. బాలీవుడ్‌ వర్గాల్లో తీవ్ర విషాదం!
బిగ్‌బాస్ ఫేమ్ 'షఫాలీ' ఇకలేరు.. బాలీవుడ్‌ వర్గాల్లో తీవ్ర విషాదం!

Shefali Jariwala: బిగ్‌బాస్ ఫేమ్ 'షఫాలీ' ఇకలేరు.. బాలీవుడ్‌ వర్గాల్లో తీవ్ర విషాదం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 28, 2025
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

నటి, మోడల్‌ షఫాలీ జరివాలా (42) గుండెపోటుతో మృతిచెందారు. శుక్రవారం రాత్రి ఆమెకు అకస్మాత్తుగా అస్వస్థత ఏర్పడగా, భర్త పరాగ్ త్యాగి వెంటనే అంధేరీలోని బెల్లేవ్యూ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం షఫాలీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కూపర్ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. ఈ విషయంలో షఫాలీ కుటుంబసభ్యులు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. షఫాలీ జరివాలా 2002లో విడుదలైన ఐకానిక్‌ మ్యూజిక్ వీడియో 'కాంటా లగా'తో విపరీతమైన ప్రజాదరణ పొందారు. ఆ పాటతో పాటు ఆమె నటన కుర్రకారును ఆకట్టుకుంది. ఆ తరువాత ఆమెకు "కాంటా లగా గర్ల్‌" అనే గుర్తింపు వచ్చింది.

Details

పలువురు ప్రముఖుల సంతాపం

అనంతరం షఫాలీ, సల్మాన్ ఖాన్‌ నటించిన 'ముజ్సే షాదీ కరోగా' సినిమాలో కనిపించారు. అలాగే పలు టీవీ రియాలిటీ షోలలో కూడా పాల్గొన్నారు. 'నాచ్ బలియే 5'లో పాల్గొనడంతో పాటు, హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 13లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంటరై ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. షఫాలీ 1982 డిసెంబర్‌ 15న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించారు. ఆమె తండ్రి పేరు సతీష్ జరివాలా, తల్లి పేరు సునీతా జరివాలా. 2014లో టీవీ నటుడు పరాగ్ త్యాగిని షఫాలీ వివాహం చేసుకున్నారు. ఆమె ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో "బ్లింగ్ ఇట్ఆన్ బేబీ" అనే క్యాప్షన్‌తో కొన్ని ఫోటోలను పోస్ట్‌ చేయడం గమనార్హం. షఫాలీ ఆకస్మిక మృతి సినీ, టెలివిజన్ పరిశ్రమను షాక్‌కు గురి చేసింది.