మా అవారా జిందగీ: జీరో పర్సెంట్ లాజిక్ తో వస్తున్న సినిమా రేపే విడుదల
బిగ్ బాస్ రియాలిటీ షోలో పేరు తెచ్చుకుని సిల్వర్ స్క్రీన్ మీద హీరోలుగా ప్రయత్నం చేస్తుంటారు. ఆ జాబితాలోకి శ్రీహాన్ చేరిపోయాడు. శ్రీహన్ హీరోగా మా ఆవారా జిందగీ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రం, రేపు థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మా అవారా జిందగీ టీమ్, మీడియాతో ముచ్చటించింది. నలుగురు ఆవారా కుర్రాళ్ళు బీటేక్ పూర్తి చేయడానికి ఎనిమిదేళ్ళ సమయం తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ల జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనేదే కథ. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దామని, ఆవారా కుర్రాళ్ళు చేసే ఫన్ అందరికీ నచ్చేలా ఉంటుందనీ చిత్ర దర్శకుడు దేపా శ్రీకాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
లాజిక్ లేకుండా 100శాతం ఫన్
జీరో పర్సెంట్ లాజిక్, 100% ఫన్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న మా అవారా జిందగీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. శ్రీహన్, అజయ్, సాయాజీ షిండే, సద్దాం, టార్జాన్ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ సినిమాను విభా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నంద్యాల మధుసూదన్ రెడ్డి నిర్మించారు. బిగ్ బాస్ ఫేమ్ తో హీరోగా మారినవారిలో హిట్ దక్కించుకున్న వారి శాతం చాలా తక్కువ. సోహైల్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు గానీ విజయాన్ని అందుకోలేకపోయాడు. మరి శ్రీహాన్, ఆ సాంప్రదాయాన్ని బద్దలు కొట్టి విజయం అందుకుని చరిత్ర సృష్టిస్తాడేమో చూడాలి.