Bigg Boss7 Promo: కొడుకుని పట్టుకొని బోరున ఏడ్చేసిన శివాజి.. బిగ్ బాస్ హౌస్‌లో ఎమోషనల్ టచ్
ఈ వార్తాకథనం ఏంటి
బిగ్ బాస్ 7 తెలుగు షో తొమ్మిదో వారానికి చేరుకుంది. వారం వారం కంటెంట్ మారుస్తూ.. ప్రేక్షకుల్లో బిగ్ బాస్ ఉత్కంఠ రేపుతున్నాడు.
తాజాగా కంటెస్టెంట్లకు ఎమోషనల్ టచ్ ఇచ్చాడు బిగ్ బాస్. మంగళవారం విడుదలైన ప్రోమోను బట్టి చూస్తే ఇది అర్థం అవుతుంది.
ఇన్నాళ్లు కుటుంబాలకు దూరంగా ఉన్న కంటెస్టెంట్లు వాళ్ల ఫ్యామిలీస్‌ను బాగా మిస్ అయ్యి ఉంటారు. ఈ క్రమంలో వారికి సర్ ప్రైజ్ ఇచ్చేందుకు కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపాడు.
సోమవారం అంతా నామినేషన్ల కారణంగా ఉద్రేకాలతో నిండిపోయిన బిగ్ బాస్ హౌస్.. మంగళవారం భావోద్వేగాలతో నిండిపోయినట్లు ప్రోమో ద్వారా తెలిసిపోయింది.
బిగ్ బాస్
నాన్నా ఏడువొద్దు: శివాజీని ఓదార్చిన కొడుకు
శివాజీని డాక్టర్ రూమ్‌కి రావాలని బిగ్బాస్ పిలిచాడు. హెల్త్ చెకప్ అనుకొని శివాజి రూమ్‌లోకి వెళ్లాడు. రోజూలాగే.. డాక్టర్‌తో శివాజీ మాట్లాడాడు.
సంభాషణ ముగిసిన తర్వాత శివాజి తిరిగి వెళ్లిపోతుండగా.. 'నాన్న' అనే పిలుపు శివాజికి వినిపిస్తుంది. అది విన్న శివాజీ కాసేపు అయోమయానికి గురవుతాడు.
ఇంతలో డాక్టర్‌గా వచ్చిన వ్యక్తి మాస్క్ తీసేయగా అసలు విషయం తెలిసింది. డాక్టర్‌గా వచ్చింది శివాజి కొడుకు. దీంతో అతన్ని హత్తుకొని శివాజి బోరున ఏడ్చేశాడు.
హౌస్‌లో అందరికీ తన కొడుకు అంటూ పరిచయం చేశాడు. అనంతరం జరిగిన తండ్రీ కొడుకుల మధ్య జరిగిన సంభాషణ కంటతడి పెట్టించింది. శివాజీ ఏడుస్తుండగా.. నాన్నా ఏడువొద్దు, నువ్వు ఏడిస్తే అందరం ఏడుస్తాము' అంటూ శివాజీ కొడుకు అంటాడు.