LOADING...
Jingo : బర్త్‌డే స్పెషల్ పోస్టర్.. 'జింఘో'లో డాలీ ధనంజయ మాస్ లుక్ వైరల్!
బర్త్‌డే స్పెషల్ పోస్టర్.. 'జింఘో'లో డాలీ ధనంజయ మాస్ లుక్ వైరల్!

Jingo : బర్త్‌డే స్పెషల్ పోస్టర్.. 'జింఘో'లో డాలీ ధనంజయ మాస్ లుక్ వైరల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 24, 2025
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

డాలి ధనంజయ హీరోగా వస్తున్న మూవీ 'జింఘో' నుంచి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఆయన పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా నుంచి సెకండ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. డాలి పిక్చర్స్, త్రిశూల్ విజనరీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శశాంక్ సోగల్ దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాది విడుదలైన అనౌన్స్‌మెంట్ వీడియో మంచి రెస్పాన్స్ సంపాదించగా, ఇప్పటికే విడుదలైన 'నారా నారా జింఘో' సాంగ్ ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ధనంజయ లుక్ ఆయన పుట్టినరోజు వేడుకలకు తగ్గట్టుగానే డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది.

Details

2026లో మూవీ రిలీజ్

ఈ సందర్భంగా దర్శకుడు శశాంక్ సోగల్ మాట్లాడుతూ 2026లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు. ఈ సినిమా కథలో రాజకీయ, కామెడీ, యాక్షన్, థ్రిల్లర్ అన్నీ మేళవించి ప్రేక్షకులకు పకడ్బందీ ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నట్టు చెప్పారు. ప్రత్యేకంగా డాలి ధనంజయ పోషించిన పాత్ర అందరినీ ఆకట్టుకుంటుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. అలాగే ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నట్టు శశాంక్ సోగల్ స్పష్టం చేశారు.