Page Loader
ఏయన్నార్ శతజయంతి ఉత్సవాల్లో బాలీవుడ్ నటుడు, ముంబై నుండి హైదరాబాద్ విచ్చేసిన స్టార్ యాక్టర్ 
అక్కినేని శతజయంతి ఉత్సవాల్లో బాలీవుడ్ ప్రముఖులు

ఏయన్నార్ శతజయంతి ఉత్సవాల్లో బాలీవుడ్ నటుడు, ముంబై నుండి హైదరాబాద్ విచ్చేసిన స్టార్ యాక్టర్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Sep 20, 2023
03:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు అన్నపూర్ణ స్టూడియోస్ లో విగ్రహావిష్కరణతో ప్రారంభమయ్యాయి. తెలుగు చిత్ర సీమను మకుటం లేని మహారాజులా ఏలిన ఏయన్నార్ శతజయంతి ఉత్సవాలు 2024 సెప్టెంబర్ 20వరకు జరగనున్నాయి. ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన విగ్రహావిష్కరణకు తెలుగు సినిమా ప్రముఖులు హాజరయ్యారు. మురళీమోహన్, బ్రహ్మానందం, మోహన్ బాబు, రామ్ చరణ్, మహేష్ బాబు, మొదలైన వారందరూ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా హాజరయ్యారు. అక్కినేని విగ్రహావిష్కరణలో నాగార్జునతో పాటు అనుపమ్ ఖేర్ దిగిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. అక్కినేని కోసం ముంబై నుండి హైదరాబాద్ రావడంతో అనుపమ్ ఖేర్ పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అక్కినేని శతజయంతి ఉత్సవాలకు హాజరైన ప్రముఖులు