Bollywood Actor Govinda: బాలీవుడ్ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 01, 2024
09:42 am
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలయ్యాయి. ముంబైలో తెల్లవారుజామున గన్ చెక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఫైర్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కాలికి గాయమైంది. వెంటనే గోవిందాను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ముంబైలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో గోవిందా చికిత్స పొందుతున్నారు.