Animal 3: యానిమల్ ప్రాంఛైజీలో మూడో పార్టు... టైటిల్ ఏంటో తెలుసా?
తక్కువ సమయంలోనే భారతీయ చిత్ర పరిశ్రమలో డైరెక్టర్‌గా అద్భుతమైన క్రేజ్,కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న టాలీవుడ్ దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగా టాప్ స్థానంలో ఉన్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందించిన 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించి రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి, బీటౌన్ నటుడు రణ్‌బీర్ కపూర్‌తో 'యానిమల్' సీక్వెల్, 'యానిమల్ పార్క్'ని తెరకెక్కించనున్నాడని సమాచారం. ఈ ప్రాంచైజీలో మూడో భాగం కూడా ఉండబోతుందని ప్రస్తుతం నెట్టింట్లో చర్చ అవుతోంది.
క్రేజీ డైరెక్టర్‌తో ప్రాంఛైజీ పై ఎక్జయిటింగ్‌గా రణ్‌బీర్
సీక్వెల్ 2027లో ప్రారంభమవుతుందని వెల్లడించిన రణ్‌బీర్ కపూర్, తర్వాత 'యానిమల్ 3' ప్రొడక్షన్ పనులను త్వరగా ప్రారంభించే దిశగా దృష్టి సారించనున్నానని తెలిపాడు. 'యానిమల్' విజయం సాధించిన తరువాత, మూడో భాగం చేయాలనే ఆలోచన మొదటి నుండి ఉందని, ఇప్పుడు అది ఒక ధృడమైన నిర్ణయంగా మారిందని రణ్‌బీర్ కపూర్ పేర్కొన్నాడు. సందీప్ రెడ్డి వంగాను ఒరిజినల్ డైరెక్టర్‌గా సంబోధించే రణ్‌బీర్.. ఈ క్రేజీ డైరెక్టర్‌తో ప్రాంఛైజీ సినిమాలు చేయడంపై ఎక్జయిటింగ్‌గా ఉన్నాడు.