Page Loader
Saiyami Kher : తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు 
తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు

Saiyami Kher : తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
May 21, 2025
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

సినీ ఇండస్ట్రీ ఎంత అభివృద్ధి చెందినా, క్యాస్టింగ్ కౌచ్ అనే చీకటి కోణం మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అనేక మంది నటి, నటీమణులు ఈ విషయం మీద బహిరంగంగా మాట్లాడారు. పేర్లతో సహా తమ అనుభవాలను వెల్లడించిన వారు కూడా ఉన్నారు. తాజాగా ఈ జాబితాలోకి నటి సయామీ ఖేర్ కూడా చేరింది. ఆమెకు టాలీవుడ్‌లో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని బయటపెట్టి, ఈ వ్యవహారంపై తన మౌనం విరిచింది. సయామీ ఖేర్ 2015లో 'రేయ్‌' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇటీవల సన్నీ డియోల్‌ నటించిన, గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన 'జాట్‌' చిత్రంలో కూడా ముఖ్యపాత్ర పోషించారు.

Details

కెరీర్‌ ఆరంభంలో ఎదురైన చేదు అనుభవం 

ఓ తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ "ఇండస్ట్రీలో నాకు వచ్చిన అవకాశాలతో నేను సంతృప్తిగా ఉన్నాను. కానీ కెరీర్‌ ప్రారంభంలో జరిగిన ఓ ఘటన మాత్రం నన్నెంతో బాధించిందంటూ చెప్పింది. ఆ సమయంలో అవకాశాలు రావాలంటే కొన్ని విషయాల్లో సర్దుబాటు కావాలని ఓ ఏజెంట్ సూచించారని వెల్లడించింది. ఆ ఏజెంట్‌ మహిళే కావడం విశేషం. "ఒక మహిళగా ఉండి, సాటి మహిళతో అలా మాట్లాడటం నాకు బాధ కలిగించింది. మొదట ఆమె మాటలు అర్థం కానట్లు నటించాను. కానీ అదే విషయాన్నిచెబుతుండడంతో... చివరికి నేను చెప్పాల్సి వచ్చింది. 'క్షమించండి.. మీరు నన్ను ఒక మార్గంలో నడిపించాలని చూస్తున్నారు. కానీ నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. వాటిని నేను ఎప్పుడూ దాటనని చెప్పానని వివరించింది.

Details

మహిళ నుంచే వచ్చిన అశ్లీల ప్రతిపాదన 

సయామీ పేర్కొన్నట్టుగా, ఆమె కెరీర్‌లో ఒక మహిళ నుంచే ఇటువంటి ప్రతిపాదన రావడం అది మొదటిసారి, అదే చివరిసారిగా మిగిలిందని చెప్పింది. ఆమె మాటల్లో ఆ ఘటనకు సంబంధించి గల బాధ, ఆవేదన స్పష్టంగా కనిపించాయి. అయినా కూడా ఆ సమయంలో తీసుకున్న ధైర్యమైన నిర్ణయం వల్ల ఆమె తన అభిప్రాయాలు, విలువలను కాపాడుకోవడంలో విజయవంతమయ్యారు. ఈ సంఘటన మరోసారి ఇండస్ట్రీలో *క్యాస్టింగ్ కౌచ్* సమస్య ఇంకా అంతరించలేదన్న దానికి నిదర్శనం. అలాగే, అవకాశాల కోసం విలువల్ని తాకట్టు పెట్టలేనని, తాను ఒక ఖచ్చితమైన పథంలోనే ముందుకు సాగుతానని సయామీ ఖేర్ చాటి చెప్పింది.