LOADING...
Vikram Bhatt: బాలీవుడ్‌ దర్శకుడు విక్రం భట్‌ అరెస్టు.. ఎందుకంటే?
బాలీవుడ్‌ దర్శకుడు విక్రం భట్‌ అరెస్టు.. ఎందుకంటే?

Vikram Bhatt: బాలీవుడ్‌ దర్శకుడు విక్రం భట్‌ అరెస్టు.. ఎందుకంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 08, 2025
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ ప్రముఖ దర్శక-నిర్మాత విక్రం భట్‌, ఆయన సతీమణి శ్వేతాంబరి ముంబయిలో ఆదివారం పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఇందిరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ అజయ్‌ మర్దియాకు రూ.30 కోట్లు మోసం చేశారన్న ఆరోపణలపై ఈ అరెస్టులు జరిగాయి. కేసు దర్యాప్తు చేపట్టిన ఉదయ్‌పుర్‌ పోలీసులు ప్రత్యేకంగా ముంబయికి చేరుకుని భట్‌ దంపతులను అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం—ఇందిరా ఐవీఎఫ్‌ ఆసుపత్రి యజమాని అయిన డాక్టర్‌ మర్దియా తన భార్య జీవిత చరిత్ర ఆధారంగా సినిమా నిర్మించేందుకు విక్రం భట్‌ను సంప్రదించారు.

Details

దర్యాప్తు కొనసాగిస్తున్న ఉదయ్‌పుర్‌ పోలీసులు

ఇదే అవకాశాన్ని ఉపయోగించుకున్న భట్‌, రూ.47 కోట్లు పెట్టుబడి పెడితే నాలుగు సినిమాలు తీయడంతో పాటు రూ.200 కోట్ల లాభం వస్తుందని మర్దియాను నమ్మబలికినట్లు వెలుగుచూసింది. ఆయన నుంచి రూ.30 కోట్లు తీసుకుని రెండు సినిమాలు మాత్రమే పూర్తి చేసి, మిగతా రెండు ప్రాజెక్టులను చేపట్టకుండా వదిలేశారని పోలీసులు తెలిపారు. ఈ పరిణామాలన్నింటితో మోసపోయానని భావించిన మర్దియా, పోలీసులను ఆశ్రయించగా భట్‌ దంపతులపై కేసు నమోదు అయింది. ప్రస్తుతం ఉదయ్‌పుర్‌ పోలీసులు ఈ వ్యవహారంపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement