LOADING...
Kalki2898AD : 'కల్కి 2'లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎంట్రీ.. ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్!
'కల్కి 2'లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎంట్రీ.. ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్!

Kalki2898AD : 'కల్కి 2'లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎంట్రీ.. ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2026
01:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని అందుకున్న 'కల్కి 2898 AD' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'కల్కి 2'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగం కానున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే గతంలో ప్రచారం జరిగినట్లుగా ఆలియా భట్ సినిమాలో 'సుమతి' పాత్రను పోషించడం లేదని సమాచారం. 'కల్కి 2898 AD' తొలి భాగంలో దీపికా పదుకొనే నటించిన సుమతి పాత్ర కథలో అత్యంత కీలకంగా నిలిచింది.

వివరాలు

రెమ్యునేషన్ కారణాల వల్ల బయటికొచ్చినట్లు సమాచారం

కానీ వర్కింగ్ అవర్స్, రెమ్యునరేషన్ వంటి కారణాల వల్ల దీపికా పదుకొనే సీక్వెల్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమె పోషించిన సుమతి పాత్రలో ఎవరు కనిపిస్తారనే అంశంపై కొద్ది రోజులుగా అనేక ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఆలియా భట్ 'కల్కి 2'లో చేరినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఆమెది సుమతి పాత్ర కాదని తెలుస్తోంది. సినిమాలో కీలకమైన ఓ ప్రత్యేక పాత్ర కోసం ఆలియా భట్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఆమెకు సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా ఇప్పటికే పూర్తైనట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన ఆలియా భట్, ఈ విజువల్ వండర్‌లో నటిస్తే సినిమాకు అదనపు ఆకర్షణ లభించే అవకాశం ఉంది

వివరాలు

త్వరలోనే అధికారిక ప్రకటన

మరోవైపు, దీపికా పదుకొనే స్థానంలో స్టార్ హీరోయిన్ సాయి పల్లవి నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆలియా భట్, సాయి పల్లవి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశముందని సినీ వర్గాల్లో చర్చ

Advertisement