Bomb Threat: తమిళ నటుడు ప్రభు ఇంటికి బాంబు బెదిరింపు
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులోని అమెరికా రాయబారి కార్యాలయం, అలాగే సినీ నటుడు ప్రభు నివాసానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చిన ఘటన కలకలం రేపింది. ఈ విషయంపై డీజీపీ కార్యాలయానికి ఒక ఈమెయిల్ చేరింది. అందులో చెన్నైలోని అన్నా ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న అమెరికా డిప్యూటీ కాన్సులేట్‌లో కొద్దిసేపట్లో బాంబు పేలబోతుందని పేర్కొన్నారు. తరువాత అదే ఈమెయిల్‌లో నటుడు ప్రభు ఇంట్లో కూడా బాంబు పేల్చుతామని హెచ్చరించారు. ఈ సమాచారం అందిన వెంటనే చెన్నై పోలీసులు అప్రమత్తమై, బాంబు స్క్వాడ్, జాగిలాలు సహాయంతో అన్నిచోట్లా తనిఖీ చేశారు.
వివరాలు
కావాలనే కొందరు ఆకతాయిలు చేసిన పని
తరువాత అమెరికా కాన్సులేట్‌లో పనిచేస్తున్న పలువురు అధికారుల నివాసాలకూ ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు గుర్తించారు. దాంతో అక్కడ కూడా పోలీసు బృందాలు జాగ్రత్త చర్యలతో తనిఖీలు నిర్వహించాయి. అయితే ఎక్కడా బాంబులు లభించకపోవడంతో ఇది కేవలం కావాలనే కొందరు ఆకతాయిలు చేసిన పని అని తేలింది. అదేవిధంగా నటుడు ఎస్.వి.శేఖర్ నివాసం, మైలాపూర్‌లోని సుబ్రమణ్యస్వామి ఇంటి వద్ద కూడా బాంబులు పెట్టారనే సమాచారంతో అధికారులు అక్కడికూడా పరిశీలనలు జరిపారు. కానీ ఎటువంటి పేలుడు పదార్థాలు కనిపించకపోవడంతో పోలీసులు అది పుకారుగా తేల్చి, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.