LOADING...
Bomb threat: చెన్నైలో నటుడి అజిత్ ఇంటికి బాంబు బెదిరింపులు 
చెన్నైలో నటుడి అజిత్ ఇంటికి బాంబు బెదిరింపులు

Bomb threat: చెన్నైలో నటుడి అజిత్ ఇంటికి బాంబు బెదిరింపులు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 11, 2025
05:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

చెన్నై నగరంలో గత కొన్ని రోజులుగా రాజకీయ నేతలు, సినీ ప్రముఖుల ఇళ్లు మరియు కార్యాలయాలకు బాంబు బెదిరింపులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం సత్యమూర్తి భవన్, ఈసీఆర్‌లో ఉన్న హీరో అజిత్ కుమార్ ఇల్లు, ఈవీసీ ఫిలిం సిటీ తదితర ప్రాంతాలకు డీజీపీ కార్యాలయానికి ఇ-మెయిల్ ద్వారా బాంబు హెచ్చరికలు వచ్చాయి. బాంబు స్క్వాడ్ నిపుణులు ఈ ప్రాంతాలను పరిశీలించగా, ఏ విధమైన ప్రమాదం లేదని తేల్చారు. అంతేకాకుండా ఎస్వీ శేఖర్, నటి రమ్యకృష్ణ ఇళ్లకు కూడా బాంబు బెదిరింపులు వచ్చినట్లు గుర్తించబడింది.

Details

అన్ని కోణాల్లో దర్యాప్తు

అదేవిధంగా, సోమవారం నటి త్రిష ఇల్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి కూడా బెదిరింపులు వెల్లువెత్తాయి. పోలీసులు ఈ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తుల గురించి వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఇ-మెయిల్ ట్రేసింగ్, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన వంటి చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.