#BoyapatiRapo: క్లైమాక్స్ కోసం 24రోజులు షూటింగ్
ఇస్మార్ట్ శంకర్ తర్వాత మాస్ జపం చేస్తున్నాడు రామ్ పోతినేని. అందుకే మాస్ అప్పీల్ ఉండే సినిమాలను ఎంచుకుంటున్నాడు. రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇంకా పేరు నిర్ణయించలేదు. అయితే ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చేసినట్లు సమాచారం. ఈ చిత్ర క్లైమాక్స్ పూర్తయిపోయిందట. 24రోజుల పాటు క్లైమాక్స్ షూటింగ్ పనులు జరిగాయట. 24రోజుల పాటు యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించారనీ, ఇది క్లైమాక్స్ కాదనీ, క్లై..మాక్స్ అని సాగదీస్తూ చెప్పాడు. దాదాపు టాకీపార్ట్ మొత్తం కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. పాటలు మాత్రమే బ్యాలన్స్ ఉన్నాయనీ, వాటిని కూడా ఫాస్ట్ గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తారట.
అనుకున్న తేదీ కంటే ముందుగా రిలీజ్
సినిమా చిత్రీకరణ తొందరగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగాన్ని పెంచుతారట. దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఒకవేళ అన్నీ కుదిరితే ఈ సినిమాను అనుకున్న తేదీ కంటే ముందుగానే రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు గ్లింప్స్ వీడియో రిలీజైంది. ఇందులో రామ్ పోతినేని చెప్పిన డైలాగ్ జనాల్లోకి బాగా వెళ్ళింది. రామ్ కెరీర్ లో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న మొదటి చిత్రం ఇది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.