NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / #BoyapatiRAPO ఫస్ట్ థండర్ రిలీజ్: మాస్ డైలాగ్ తో ఊరమాస్ లుక్ లో రామ్ పోతినేని 
    తదుపరి వార్తా కథనం
    #BoyapatiRAPO ఫస్ట్ థండర్ రిలీజ్: మాస్ డైలాగ్ తో ఊరమాస్ లుక్ లో రామ్ పోతినేని 
    BoyapatiRAPO టీజర్ విడుదల

    #BoyapatiRAPO ఫస్ట్ థండర్ రిలీజ్: మాస్ డైలాగ్ తో ఊరమాస్ లుక్ లో రామ్ పోతినేని 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 15, 2023
    01:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హీరో రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా బోయపాటి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమాలోంచి ఫస్ట్ థండర్ పేరుతో చిన్నపాటి టీజర్ రిలీజ్ అయ్యింది.

    ఈ టీజర్ లో రామ్ పోతినేని ఊరమాస్ గెటప్ లో కనిపించారు. ఇదివరకు రిలీజైన ఫస్ట్ లుక్ మాదిరిగానే మాస్ అవతార్ లో దర్శనమిచ్చాడు.

    అడ్డదిడ్డంగా పెరిగిన గడ్డం, కొంత లావెక్కిన శరీరం.. అన్నీ కలిసి అసలు సిసలు మాస్ ని రామ్ లోంచి బయటకు తీసుకొచ్చాయి.

    స్టేట్ దాటలేనన్నావ్, దాటా.. గేటు దాటలేనన్నావ్, దాటా.. ఇంకెంటి బొంగులో లిమిట్స్ అంటూ డైలాగ్ లోనూ మాస్ ని చూపించాడు. ఇక దున్నపోతును తీసుకొచ్చి ఫైట్ చేయడం అనేది ఫస్ట్ థండర్ లో హైలైట్ గా నిలిచింది.

    Details

    పాన్ ఇండియా రేంజ్ లో విడుదల 

    బోయపాటి హీరో ఎలా ఉంటాడో అలా కనిపించాడు రామ్. ఈ టీజర్ లో రామ్ లోని చాక్లెట్ బాయ్ ఆనవాళ్ళు ఎక్కడా కనిపించలేదు. హీరోయిన్ శ్రీలీల ఒకే ఒక్క షాట్ లో మెరిసింది.

    ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, కన్నడ,మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు టీజర్ లో ప్రకటించారు కూడా.

    ఇస్మార్ట్ శంకర్ నుండి రామ్ పోతినేని, మాస్ ఇమేజ్ మీద బాగా దృష్టి పెట్టాడు. ఇస్మార్ట్ తర్వాత రెడ్ లో కూడా మాస్ క్యారెక్టర్ చేసాడు. ఇప్పుడు పూర్తిస్థాయి మాస్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాను అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    #BoyapatiRAPO: టీజర్ విడుదల 

    #BoyapatiRAPO Teaser https://t.co/IYtlPNQYyO pic.twitter.com/1I5oDLSPks

    — RAm POthineni (@ramsayz) May 15, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    AP Rains: ఏపీలో నేడు పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన.. అత్యంత వేగంగా నైరుతి రుతుపవనాలు  ఆంధ్రప్రదేశ్
    Iran-Israel: ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్ ప్లాన్: అమెరికా నిఘా వర్గాలు   ఇరాన్
    Mumbai Rain: ముంబైను ముంచెత్తిన కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం.. వాహనదారులకు ఇక్కట్లు ముంబై
    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్

    సినిమా

    పెళ్లికి ఎస్ చెప్పిన గాలోడు సుధీర్?  తెలుగు సినిమా
    కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో సిద్ధార్థ్  తెలుగు సినిమా
    ఆదిపురుష్ లో అసలు ఫైట్, బయటకు వచ్చిన తాజా అప్డేట్  తెలుగు సినిమా
    పుష్ప యాక్టర్ ఫాహద్ ఫాజిల్ నటిస్తున్న ధూమమ్ ఫస్ట్ లుక్ విడుదల  సినిమా

    తెలుగు సినిమా

    హనుమాన్ సినిమా విడుదల వాయిదా: మళ్ళీ రిలీజ్ ఎప్పుడంటే?  సినిమా రిలీజ్
    కస్టడీ ట్రైలర్: ముఖ్యమంత్రి కారునే ఆపేసిన కానిస్టేబుల్  కస్టడీ
    ఆదిపురుష్ ట్రైలర్: మే 9వ తేదీన ముహూర్తం; దర్శకుడికి లాస్ట్ ఛాన్స్ అంటున్న నెటిజన్లు  ఆదిపురుష్
    తెలుగు తెరకు సూపర్ స్టార్ కృష్ణ పరిచయం చేసిన సరికొత్త టెక్నాలజీస్ ఏంటంటే?  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025