హీరో రామ్ పోతినేని బర్త్ డే: చాక్లెట్ బాయ్ లా కాకుండా విభిన్నంగా కనిపించిన చిత్రాలు
ఈ వార్తాకథనం ఏంటి
సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకు, ముఖ్యంగా నటులకు ఒక తరహా పాత్రలే వస్తుంటాయి. అలాంటి పాత్రల్లోనే వాళ్ళు బాగుంటారని దర్శకులు, ప్రేక్షకులు (ఒకానొక దశలో) నమ్మేస్తుంటారు.
కొన్నిసార్లు మాత్రమే ఈ నమ్మకాలు అబద్ధమని రుజువవుతుంది. అలా ప్రూవ్ చేసిన హీరోల్లో రామ్ పోతినేని ఒకరు. చూడ్డానికి చాక్లెట్ బాయ్ లా ఉంటాడు, కానీ మాస్ మసాలా సినిమాలతోనూ హిట్ అందుకున్నాడు.
రామ్ పోతినేని నటించిన మాస్ మసాలా సినిమాలేంటో చూద్దాం.
ఇస్మార్ట్ శంకర్:
పూరీ జగన్నాథ్ చేతిలో పడితే ఏ హీరో అయినా మాస్ హీరో ఐపోతాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రామ్ పోతినేని అలా అయ్యాడు. ఈ సినిమాలో రామ్ నటన, డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్సులు.. ప్రేక్షకులకు బాగా నచ్చాయి.
Details
సుకుమార్ దర్శకత్వంలోని మాస్ క్యారెక్టర్
జగడం:
సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సరిగ్గా ఆడలేదు కానీ ఇందులో రామ్ పోతినేని అసలైన మాస్ హీరోలా ఉంటాడు. మాస్ సినిమాలో, మాస్ అంశాలతో సందేశాన్ని మేళవించవచ్చని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది.
మస్కా:
హన్సికా మోతానీ, షీలా హీరోయిన్లుగా కనిపించిన ఈ చిత్రం, బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సునీల్ కామెడీ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ.
కందిరీగ:
సినిమాల్లో హీరోయిన్లకు యాటిట్యూడ్ ఉంటుంది. అది కొంచెం ఎక్కువగా ఉండే సినిమా కందిరీగ. హీరో క్యారెక్టరైజేషన్ మీద ఈ సినిమా కథ నడుస్తుంది. హ్యాపీగా నవ్వుకుంటూ హాయిగా చూసేయవచ్చు.