Page Loader
ఇస్మార్ట్ శంకర్ ఇజ్ బ్యాక్

ఇస్మార్ట్ శంకర్ ఇజ్ బ్యాక్

వ్రాసిన వారు Sirish Praharaju
May 14, 2023
05:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ అప్పుడే చెప్పారు. రేపు రామ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకి సీక్వెల్ ప్రారంభంకానున్నట్లు పూరికనక్ట్స్ అధికారికంగా కాసేపటి క్రితమే ట్విట్టర్ ద్వారా వెల్లండించింది. డబల్ ఇస్మార్ట్ పేరుతో తెరకెక్కనున్న ఈ పాన్ ఇండియా మూవీ వచ్చే సంవత్సరం మహాశివరాత్రి(మార్చి 8,2024) రోజున రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

డబుల్ ఇస్మార్ట్‌ టైటిల్.. పూరీ, రామ్‌ ప్రాజెక్ట్‌ వివరాలివే