Page Loader
Brahmanandam: ఇన్‌స్టా లోకి 'బ్రహ్మానందం' ఎంట్రీ.. ఫాలోవర్ల సంఖ్య క్షణాల్లో పెరిగిపోయింది
ఇన్‌స్టా లోకి 'బ్రహ్మానందం' ఎంట్రీ.. ఫాలోవర్ల సంఖ్య క్షణాల్లో పెరిగిపోయింది

Brahmanandam: ఇన్‌స్టా లోకి 'బ్రహ్మానందం' ఎంట్రీ.. ఫాలోవర్ల సంఖ్య క్షణాల్లో పెరిగిపోయింది

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 03, 2025
11:44 am

ఈ వార్తాకథనం ఏంటి

చలనచిత్ర పరిశ్రమలో బ్రహ్మానందం తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నారు. తన నవ్వుల ద్వారా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తెలుగు సినీ ప్రేక్షకులను అలరించారు. ఆయన కామెడీ వల్లే చాలా సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఒకప్పుడు ఏడాదికి 10 సినిమాలు చేసే బిజీ స్టార్‌గా ఉన్న బ్రహ్మానందం, ఇటీవల కాలంలో సినిమాలు తగ్గించారు. కానీ ఇప్పటికీ ఆయన పేరు సోషల్ మీడియాలో అనేక సందర్భాల్లో మారుమ్రోగుతోంది. ఇటీవల, బ్రహ్మానందం తన అభిమానులతో మరింత దగ్గర కావాలని నిర్ణయించుకుని, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చారు.

Details

మీమ్స్‌పై ఆయన ఎలా స్పందిస్తారో

తన సోషల్ మీడియా IDగా 'Yourbrahmanandam' ను నమోదు చేశారు. ప్రస్తుతం తన కొడుకు గౌతమ్‌తో కలిసి 'బ్రహ్మానందం' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్‌లో ఈ విషయం వెల్లడించారు. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లోని IDని అభిమానులు అడగ్గా, 'Yourbrahmanandam' అని చెప్పి, తన కొత్త ఇన్‌స్టా ఖాతాకు ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన ఈ అకౌంట్లో ఎలాంటి పోస్ట్‌లు చేయలేదు. అయినా బ్రహ్మానందానికి సుమారు 163K ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఇన్‌స్టాలో తనపై వచ్చే మీమ్స్ పట్ల ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.