LOADING...
Year Ender 2025: ప్రేమకు బ్రేక్.. పెళ్లిళ్లకు ఫుల్‌స్టాప్! 2025లో విడిపోయిన సెలబ్రిటీ జంటలివే 
ప్రేమకు బ్రేక్.. పెళ్లిళ్లకు ఫుల్‌స్టాప్! 2025లో విడిపోయిన సెలబ్రిటీ జంటలివే

Year Ender 2025: ప్రేమకు బ్రేక్.. పెళ్లిళ్లకు ఫుల్‌స్టాప్! 2025లో విడిపోయిన సెలబ్రిటీ జంటలివే 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 23, 2025
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

2025 సంవత్సరం వినోద ప్రపంచానికి కేవలం విజయాలకే కాదు, అనూహ్యమైన బ్రేకప్‌లు, విడాకులకూ గుర్తుండిపోయే ఏడాదిగా నిలిచింది. సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న, వివాహ బంధంలో ఉన్న పలువురు ప్రముఖ జంటలు తమ సంబంధాలకు ముగింపు పలికారు. అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసిన అలాంటి సెలబ్రిటీ విడిపోకలపై ఒకసారి ఓ లుక్కేద్దాం.

Details

కేటీ పెర్రీ - ఆర్లాండో బ్లూమ్

హాలీవుడ్ స్టార్ జంట కేటీ పెర్రీ, ఆర్లాండో బ్లూమ్ తొమ్మిదేళ్ల పాటు కలిసి ఉన్న తర్వాత విడిపోయినట్లు ప్రకటించారు. 2019లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంటకు డైసీ డోవ్ అనే కుమార్తె ఉంది. వారి బ్రేకప్ వార్త ప్రపంచవ్యాప్తంగా అభిమానులను షాక్‌కు గురిచేసింది. తమన్నా భాటియా - విజయ్ వర్మ బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన మరో విడిపోవడం తమన్నా భాటియా - విజయ్ వర్మది. 2023లో డేటింగ్ ప్రారంభించిన ఈ జంట, 2025 మార్చిలో విడిపోయారనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ అంశంపై అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు.

Details

సానియా మీర్జా - షోయబ్ మాలిక్

ఇప్పటికే విడిపోయినట్లు ప్రచారం ఉన్న సానియా మీర్జా - షోయబ్ మాలిక్ జంట విడాకులు 2025 ప్రారంభంలో అధికారికంగా పూర్తయ్యాయి. షోయబ్ మాలిక్ తన మూడో వివాహాన్ని ప్రకటించిన అనంతరం ఈ విషయం మరింత చర్చకు వచ్చింది. రాహుల్ దేశ్‌పాండే - నేహా మరాఠీ గాయకుడు రాహుల్ దేశ్‌పాండే, ఆయన భార్య నేహా 17 ఏళ్ల దాంపత్య జీవనానికి ముగింపు పలికినట్లు సెప్టెంబర్ 2025లో సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 2008లో వివాహం చేసుకున్న ఈ జంట, కుమార్తె రేణుకను కలిసి పెంచేందుకు కో-పేరెంటింగ్ కొనసాగిస్తామని తెలిపారు.

Advertisement

Details

పాలాష్ ముచ్ఛాల్ - స్మృతి మంధాన

సింగర్ పాలాష్ ముచ్ఛాల్, భారత క్రికెటర్ స్మృతి మంధాన వివాహం రద్దయినట్లు వార్తలు వెలువడ్డాయి. కుటుంబ కారణాల వల్లే పెళ్లి ఆగిపోయిందని సమాచారం. ఈ నేపథ్యంలో పాలాష్ గత సంబంధాలపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. లతా సభర్వాల్ - సంజీవ్ సేథ్ 'యే రిష్తా క్యా కేహ్లాతా హై' సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న లతా సభర్వాల్ - సంజీవ్ సేథ్ జంట 2009లో వివాహం చేసుకుని, 15 ఏళ్ల తర్వాత 2025లో విడిపోయారు. ఈ వార్త టీవీ ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది.

Advertisement

Details

జెన్నిఫర్ లోపెజ్ - బెన్ అఫ్లెక్

20 ఏళ్ల విరామం తర్వాత ప్రేమను తిరిగి మొదలుపెట్టిన జెన్నిఫర్ లోపెజ్, బెన్ అఫ్లెక్ 2021లో వివాహం చేసుకున్నారు. అయితే వ్యక్తిగత విభేదాల కారణంగా 2024లో విడిపోయిన ఈ జంట, 2025 ఫిబ్రవరిలో విడాకులను అధికారికంగా పూర్తి చేశారు. సెలీనా జైట్లీ - పీటర్ హాగ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్‌పై గృహహింస ఆరోపణలతో ముంబై అంధేరి కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో పీటర్ ఆస్ట్రియాలో విడాకుల కేసు వేశారు. 2010లో వివాహం చేసుకున్న ఈ జంటకు 2012లో కవల పిల్లలు జన్మించారు.

Details

ధనశ్రీ వర్మ - యుజ్వేంద్ర చహల్

కోరియోగ్రాఫర్ నుంచి నటి అయిన ధనశ్రీ వర్మ, టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ విడాకులు ఈ ఏడాది అత్యంత చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలోనూ ఈ విడిపోవడంపై విస్తృత చర్చ జరిగింది.

Advertisement