
Bubblegum review: బబుల్‌గమ్ రివ్యూ.. రోషన్ కనకాల ప్రేక్షకులను మెప్పించాడా?
ఈ వార్తాకథనం ఏంటి
యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల(Roshan Kanakala) బబుల్‌గమ్ (Bubblgum) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల సినిమాలతో మెప్పించిన దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ కనకాల ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
ఈ సినిమాలో మానస చౌదరి హీరోయిన్‌గా నటించగా, అను హాసన్, హర్ష వర్ధన్, కిరణ్ మచ్చ, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి కీలక పాత్రలో నటించారు.
మరి రోషన్ కనకాల తన మొదటి సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించాడో లేదో మూవీ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
ఆది అలియాస్ ఆదిత్య (రోషన్ కనకాల) ఓ మధ్య తరగతి కుర్రాడు. డీజే కావాలని ప్రయత్నిస్తుంటాడు.
Details
క్లైమాక్స్ మినహా మిగత కథ అంతా చాలా రోటీన్
ఓ పార్టీలో జాను (మానస చౌదరి)ని చూసి ఆదిప్రేమిస్తాడు. అమె అబ్బాయిల్నీ ఓ టాయ్‌లా చూస్తుంది.
ఈ క్రమంలో ఆది ప్రవర్తన నచ్చి అతనితో ప్రేమలో పడుతుంది. అయితే ఓ వేడుకలో ఆదిని జాను ఘోరంగా అవమానిస్తుంది.
మరి తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
క్లైమాక్స్ మినహా మిగతా కథ అంతా చాలా రోటీన్‌గా ఉంటుంది.
ఓ చిన్న ఇంట్రడక్షన్ ఫైట్ హీరో ఎంట్రీ ఇచ్చిన తీరు ఫర్వాలేదనిపించింది.
విరామ సన్నివేశాలు మాత్రం కాస్త కొత్తగా ఉండటంతో ద్వితీయార్థం ఆసక్తి రేకెత్తించేలా చేస్తుంది.
Details
రోషన్ కనకాల నటన అద్భుతం
ప్రియురాలి చేతిలో అవమానం తర్వాత ఆది లక్ష్యం దిశగా అడుగులేసే తీరు మెప్పిస్తుంది. ఆది పాత్రలో రోషన్ అద్భుతంగా నటించాడు.
ముఖ్యంగా భావోద్వేగభరిత సన్నివేశాల్లో చక్కగా ఒదిగిపోయాడు. హీరో తండ్రిగా చైతూ జోన్నలగడ్డ పాత్ర అందర్నీ ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాలో రోషన్, మానస నటన అద్భుతంగా నటించారు. నేపథ్య సంగీతం, నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి.
కొత్తదనం లేని కథతో ప్రేక్షకులకు కొద్దిగా బోరింగా అనిపిస్తుంది. చివరికి ఈ సినిమా కొత్తతరం వారికి నచ్చుతుంది.