Page Loader
రామ్ చరణ్ 16వ సినిమా: ఆల్రెడీ పనులు మొదలెట్టిన బుచ్చిబాబు; ఫోటో రిలీజ్ 
రామ్ చరణ్ తో బుచ్చిబాబు సెల్ఫీ

రామ్ చరణ్ 16వ సినిమా: ఆల్రెడీ పనులు మొదలెట్టిన బుచ్చిబాబు; ఫోటో రిలీజ్ 

వ్రాసిన వారు Sriram Pranateja
May 24, 2023
04:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

రామ్ చరణ్ 16వ సినిమాను ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ప్రకటన వచ్చి చాలా రోజులు అవుతోంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. రాజకీయ అంశాలు ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమాలో ఉండనున్నాయి. అదలా ఉంచితే, ఇప్పుడు బుచ్చిబాబు తో కలిసి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో రామ్ చరణ్ పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. తాజాగా రామ్ చరణ్ తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన బుచ్చిబాబు, గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ తో అద్భుతమైన క్షణాలు ముందున్నాయని పోస్ట్ చేసాడు. దీంతో ఆల్రెడీ రామ్ చరణ్ 16వ సినిమా పనులు స్టార్ట్ అయ్యాయని అనుకుంటున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రామ్ చరణ్ తో బుచ్చిబాబు సెల్ఫీ