Page Loader
National Cinema Day: మూవీ లవర్స్‌కి బంపర్ ఆఫర్.. రూ.99కే మల్టీప్లెక్స్‌లో సినిమా
మూవీ లవర్స్‌కి బంపర్ ఆఫర్.. రూ.99కే మల్టీప్లెక్స్‌లో సినిమా

National Cinema Day: మూవీ లవర్స్‌కి బంపర్ ఆఫర్.. రూ.99కే మల్టీప్లెక్స్‌లో సినిమా

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2023
06:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సినీ ప్రియులకు శుభవార్త చెప్పింది. అక్టోబర్ 13 జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్ లలో కేవలం రూ.99 లకే టికెట్స్ బుక్ చేసుకోవచ్చని ఆ సంస్థ స్పష్టం చేసింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఎంపిక చేసిన నగరాలు, థియేటర్లలో మాత్రమే వర్తించనుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ ఆఫర్‌తో దాదాపు 4వేల కంటే ఎక్కువ స్క్రీన్ లలో కేవలం 99కే సినిమా చూసే అవకాశాన్ని కల్పించింది.

Details

తెలుగు రాష్ట్రాలకు వర్తించని ఆఫర్

ఇక రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలలో మాత్రం ఈ ఆఫర్ వర్తించదు. తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లలో రూ.112, కేరళ మల్టీప్లెక్స్ లలో రూ.129 విక్రయించనున్నారు. మరోవైపు దేశంలోని పలుచోట్ల రూ.99కే టికెట్లు విక్రయిస్తున్నారు. అయితే రెగ్యులర్ ఫార్మాట్, నాన్ రెక్లయినర్ సీట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్.. పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్, సిటీప్రైడ్, ఏషియన్, ముక్తా ఏ2, మూవీ టైమ్, వేవ్, ఎం2కే, డిలైట్‍ వంటి థియేటర్లలో అందుబాటులో ఉండనుంది.