రెండు భాగాలుగా రానున్న ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల లిస్ట్ చూస్తే ఎవరికైనా ఆశ్వర్యమేస్తుంది. ఇండియాలో ఏ స్టార్ చేతిలోనూ అన్నేసి సినిమాలు లేవు. ఆదిపురుష్, సలార్, రాజా డీలక్స్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ ఇంకా నిన్నకాక మొన్న కన్ఫర్మ్ అయిన హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మరొకటి. ఈ వరుస లైనప్ లలో ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న సినిమా ప్రాజెక్ట్ కె అనే చెప్పాలి. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సినిమా ఉండబోతుందని తెలియడంతో ఎక్కువ మంది ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ఒక వార్త బయటకు వచ్చింది. ప్రాజెక్ట్ కె మూవీ రెండు భాగాలుగా విడుదలవుతుందని బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
దీపికా పదుకునే యాక్సిడెంట్ తో ముగిసే మొదటి భాగం
ప్రాజెక్ట్ కె రెండు భాగాల విషయమై ఇప్పటికైతే చిత్ర నిర్మాతలు కానీ, దర్శకుడు నాగ్ అశ్విన్ కానీ స్పందించలేదు. మొదటి భాగం క్లైమాక్స్ లో దీపికా పదుకునే పాత్రకు యాక్సిడెంట్ అవుతుందని, అదెందుకు జరిగిందనేది రెండవ పార్ట్ లో ఆసక్తికరంగా ఉంటుందని అనుకుంటున్నారు. ప్రాజెక్ట్ కె చిత్రాన్ని నాగ్ అశ్విన్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల వచ్చిన దీపికా పదుకునే పోస్టర్, టైర్ గురించి తెలిపే చిన్నపాటి వీడియో చూస్తుంటే ఇంతవరకూ తెలుగు తెరమీద చూడని ప్రపంచాన్ని నాగ్ అశ్విన్ చూపించబోతున్నారని అర్తం అవుతోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రూపొందుతున్న ప్రాజెక్ట్ కె, ఇండియాలోనే అత్యంత ఖరీదైన చిత్రమని నిర్మాతలు ఇంతకుముందే తెలియజేసారు.