Page Loader
కేన్స్ 2023: లెహెంగాలో రెడ్ కార్పెట్ పై నడిచిన సారా ఆలీ ఖాన్; పెళ్ళి కూతురిలా ఉన్నావంటూ కామెంట్స్ 
కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై నడిచిన సారా ఆలీ ఖాన్

కేన్స్ 2023: లెహెంగాలో రెడ్ కార్పెట్ పై నడిచిన సారా ఆలీ ఖాన్; పెళ్ళి కూతురిలా ఉన్నావంటూ కామెంట్స్ 

వ్రాసిన వారు Sriram Pranateja
May 17, 2023
01:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో భారతీయ సినిమా స్టార్లు రెడ్ కార్పెట్ మీద నడుస్తూ హొయలు పోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ సారా ఆలీ ఖాన్, లెహెంగా ధరించి రెడ్ కార్పెట్ మీద నడిచింది. అచ్చమైన భారతీయ వస్త్రాధారణలో సారా కనిపించింది. తన సినిమా జీన్ డూ బ్యారీ ప్రదర్శన సందర్భంగా రెడ్ కార్పెట్ మీద నడిచింది. ఈ చిత్రంలో జానీ డీప్ నటించారు. క్రీమ్ కలర్ లెహెంగాలో తళుక్కున మెరిసింది సారా. రెడ్ కార్పెట్ మీద నడిచిన అనంతరం, ఆమె తన ఫోటోలను ఇన్స్ టాలో పోస్ట్ చేసింది. సారా పోస్ట్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ లో తుఫానులా మారాయి. ఈ ఫోటోలకు చాలా కామెంట్స్ వస్తున్నాయి.

Details

భారత ప్రతినిధిగా ఈషా గుప్తా 

లెహెంగాలో అచ్చం పెళ్ళి కూతురిలా ఉన్నావంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో భారతీయ సాంప్రదాయాన్ని ప్రపంచ వేదిక మీద పాటిస్తున్నందకు మెచ్చుకున్నారు. మీరు మీ సంస్కృతిని మర్చిపోనందుకు థ్యాంక్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫెస్టివల్ లో భారతీయ ప్రతినిధిగా బాలీవుడ్ నటి ఈషా గుప్తా రెడ్ కార్పెట్ మీద క్యాట్ చేసింది. అలాగే ఐశ్వర్యారాయ్ బచ్చన్, మృణాల్ ఠాకూర్, మానుషి చిల్లర్, డాలీ సింగ్, టీవీ నటుడు సాక్షి ప్రధాన్ మొదలగు వారందరూ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ కు హాజరయ్యారు. మే 16వ తేదీన మొదలైన ఈ ఫ్స్టివల్ మే 27వ తేదీ వరకు జరుగుతుంది.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

లెహెంగాలో మెరిసిన సారా ఆలీ ఖాన్