Page Loader
Jani Master: జానీ మాస్టర్‌పై పోక్సో యాక్ట్ కింద కేసు.. మైనర్‌పై లైంగిక వేధింపులు 
జానీ మాస్టర్‌పై పోక్సో యాక్ట్ కింద కేసు.. మైనర్‌పై లైంగిక వేధింపులు

Jani Master: జానీ మాస్టర్‌పై పోక్సో యాక్ట్ కింద కేసు.. మైనర్‌పై లైంగిక వేధింపులు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 18, 2024
05:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ (అలియాస్ షేక్ జానీబాషా) పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. ముంబయిలోని ఓ హోటల్‌లో మైనర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు పోలీసులు పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జానీ మాస్టర్ పరారీలో ఉన్నారు. ఆయనను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులు చేశాడని, 2017లో ఆయనతో పరిచయం అయ్యిందని బాధితురాలు పేర్కొంది.

Details

పరారీలో జానీ మాస్టర్

2019లో జానీ మాస్టర్ బృందంలో చేరారని, 2019లో ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ కోసం వెళ్లినప్పుడు జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె పేర్కొంది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తనను పనినుంచి తొలగిస్తానని బెదిరించి, సినిమా పరిశ్రమలో తనకు అవకాశం ఇవ్వకుండా చేశారని బాధితురాలు వాపోయింది. పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన జానీ మాస్టర్ తనపై వేధింపులు చేశాడని, వ్యానిటీ వాన్‌లో అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధితురాలు తెలిపింది. ఈ మేరకు రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, ఈ కేసును నార్సింగి పోలీసులకు బదిలీ చేశారు.