Bernard Hill: 'టైటానిక్' నటుడు బెర్నార్డ్ హిల్ కన్నుమూత
వెటరన్ బ్రిటీష్ నటుడు బెర్నార్డ్ హిల్ కన్నుమూశారు. ఆయనకు 79 ఏళ్లు. ఆయన మృతి పట్ల అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. 1997లో విడుదలైన టైటానిక్ చిత్రంలో బెర్నార్డ్ హిల్ కెప్టెన్ పాత్రలో కనిపించాడు. అతని పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చింది. అయన మరణాన్నిఅయన మేనేజర్ ధృవీకరించారు. దీనితో పాటు, బార్బరా డిక్సన్ కూడా బెర్నార్డ్ హిల్ మరణ వార్తను పంచుకున్నారు. 'టైటానిక్' కాకుండా, 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్'లో కూడా బెర్నార్డ్ హిల్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించాడు. కింగ్ థియోడెన్‌గా గుర్తుండిపోయే పాత్రను పోషించాడు. హిల్ ఇటీవలే BBC డ్రామా 'ది రెస్పాండర్' సీజన్ 2లో కూడా కనిపించాడు. నటుడి మృతితో వినోద పరిశ్రమలో విషాద వాతావరణం నెలకొంది.