Chiranjeevi Charitable Trust: చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతి మంజూరు
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పటివరకు వేలాది మందికి ఆర్థిక సహాయంతో పాటు అనేక సేవలు అందించారు. చిరంజీవి సేవా మిషన్‌కు ప్రతిరూపంగా నిలిచింది 'చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్' (CCT). ఈ సంస్థలో భాగంగా ఆయన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌ను స్థాపించగా, గత 27 ఏళ్లుగా వేలాది మంది రక్తదానం, నేత్రదానాల ద్వారా పునర్జీవనాన్ని పొందుతున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ఈ ట్రస్ట్ చేపట్టిన సేవా కార్యక్రమాలు విశేషంగా నిలిచాయి. తాజాగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలకు కేంద్ర ప్రభుత్వం అధికారిక గుర్తింపు లభించింది.
Details
విరాళాలు స్వీకరించే అధికారిక అర్హత
ఈ మేరకు ట్రస్ట్‌కు పెద్ద గుడ్ న్యూస్ వచ్చింది. కేంద్ర హోంశాఖ, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు ఎఫ్‌సీఆర్‌ఏ (Foreign Contribution Regulation Act) కింద రిజిస్ట్రేషన్‌కు అనుమతి మంజూరు చేసింది. దీని వలన ట్రస్ట్ విదేశాల నుంచి కూడా విరాళాలు స్వీకరించే అధికారిక అర్హత పొందింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ అధికారులు అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు. కొన్ని నెలల క్రితమే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం-2010లో కొన్ని నిబంధనలు మార్పులు చేసిన నేపథ్యంలో, ట్రస్ట్ ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పుడు ఆ అనుమతి లభించింది.
Details
హీరోయిన్ గా నయనతార
సినీ పరంగా చూస్తే — చిరంజీవి ప్రస్తుతం 'మన శంకర వరప్రసాద్ గారు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్‌లకు పేరెన్నికగన్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. పక్కా ఫ్యామిలీ మరియు కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది.